Vijay Devarakonda: కన్నడలో మాట్లాడి అదరగొట్టిన విజయ్‌ దేవరకొండ.. రష్మిక మందన్నా ఫ్యామిలీ ఫిదా

Published : Apr 09, 2026, 10:23 AM IST

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట కొడగులోని విరాజపేటలో తమ పెళ్లి రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో  విజయ్ దేవరకొండ కన్నడలో మాట్లాడి అందరినీ, ముఖ్యంగా రష్మికను ఆశ్చర్యపరిచారు. 

PREV
16
అత్తారింట్లో విజయ్‌ దేవరకొండ సందడి

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తన  ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే విజయ్‌ తన అత్తగారి ఇంటికి వెళ్లాడు.  కర్నాటకలోని కొడగుకి చెందిన విరాజ్ పేట విలేజ్‌లో రష్మిక కుటుంబ సభ్యులు, బంధువుల కోసం ఈ జంట గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది. ఇందులో అక్కడి సాంప్రదాయ లుక్‌లో మెరిశారు విరోష్‌ జంట.

26
కొడవ ట్రెడిషన్‌లో మెరిసిన విజయ్‌, రష్మిక

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో కొడవ, తెలుగు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే.  ఫిబ్రవరి 26న మ్యారేజ్‌ జరగ్గా, మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు విరాజ్‌పేటలో నిర్వహించిన రిసెప్షన్‌లో రష్మిక పూర్తిగా కొడవ అమ్మాయిలా మెరిసింది. ఆమె హెయిర్‌స్టైల్, నగలు, దుస్తులు అన్నీ కొడవ సంప్రదాయంలోనే ఉన్నాయి. తెలుగు కోడలైనా తన పుట్టింటి సంప్రదాయాన్ని పాటించడం విశేషం. ఇక  విజయ్ దేవరకొండ నలుపు, తెలుపు సూట్‌లో కనిపించారు.

36
కన్నడలో మాట్లాడి సర్ప్రైజ్‌ చేసిన విజయ్‌

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించడం అసలు హైలైట్. నిజానికి రష్మిక మందన్నకు కన్నడ బాగానే వచ్చు. గతంలో కొన్నిసార్లు కన్నడ రానట్లు మాట్లాడినా, ఆమె బాగా కన్నడ మాట్లాడిన వీడియోలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు విజయ్ కన్నడ మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

46
విజయ్‌ కన్నడ స్పీచ్‌కి ఫిదా అయిన రష్మిక

కొడవ ప్రజలను ఉద్దేశించి విజయ్ దేవరకొండ, "ఎల్లరిగూ నమస్కార, ఎల్లరూ హేగిద్దీరా?" (అందరికీ నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు?) అని కన్నడలో అనగానే, అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో మోత మోగించారు. తన భర్త కన్నడ మాటలు విని రష్మిక కూడా షాక్ అయింది. ఓ రకంగా ఫిదా అయిపోయింది.

56
విజయ్‌ కన్నడ మాటలకు బంధువులంతా క్లాప్స్
ఆ తర్వాత విజయ్ ఇంగ్లీషులో మాట్లాడుతూ, తాను రష్మిక నుండి కొన్ని కన్నడ, కొడవ పదాలు నేర్చుకున్నానని చెప్పి కొన్ని పదాలు కూడా పలికారు. దీంతో అక్కడున్న వారంతా మరింత సంతోషంతో చప్పట్లు కొట్టారు.
66
రష్మిక మందన్నా కుటుంబం స్పెషల్‌ రిసెప్షన్‌ ఏర్పాటు

ఈ జంట రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆ వేడుకకు కొడగులోని చాలామంది బంధువులు వెళ్లలేకపోయారు. అందుకే, మందన్న కుటుంబం తమ  ఆత్మీయులు, బంధువుల కోసం ఈ ప్రత్యేక రిసెప్షన్‌ను ఏర్పాటు చేసింది. ఇక 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories