ప్రస్తుతం తెలుగు ఫోక్ సాంగ్స్ హవా నడుస్తోంది. మట్టి వాసనతో, స్వచ్ఛమైన గ్రామీణ యాసతో సాగే ఈ పాటలు అందరి మనసులను గెలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో 'సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్నా రాములమ్మ' అనే పాట యూట్యూబ్‌లో సంచలనం రేపింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ పాటలోని మాధుర్యం, భావోద్వేగం ఏ అమ్మాయినైనా కరిగించేలా ఉంటుంది.
ఈ సాంగ్ ను 'M S ADDA' అనే యూట్యూబ్ ఛానల్ విడుదల చేసింది. ఈ పాటను ప్రముఖ ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాడారు. పాటకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. కేవలం పాడటమే కాకుండా, ఈ పాటలో రాము రాథోడ్ నటించారు. జోడీగా దివ్య భగత్ నటించగా, వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సాంగ్‌ను విజువల్‌గా కూడా క్లాసిక్‌గా మార్చేసింది. యూట్యూబ్ లో ఇప్పటివరకు 31 కోట్లకు పైగా (318184426) వ్యూస్, 1.6M లైకులు వచ్చాయి. ఈ సూపర్ హిట్ ఫోక్ సాంగ్ పూర్తి లిరిక్స్ ఇలా ఉన్నాయి..