ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ రివ్యూ... సెన్సార్ టాక్ చూసి షాక్ అవుతున్న ఆడియన్స్! హిట్టా ఫట్టా?

First Published | Apr 4, 2024, 4:09 PM IST

మరికొద్ది గంటల్లో ఫ్యామిలీ స్టార్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా  ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మూవీ చూసిన సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేశారు. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సెన్సార్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 

Family Star Review

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టార్ రూపొందింది. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

Family Star Review

ఫ్యామిలీ స్టార్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ది సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్  ఫ్యామిలీ స్టార్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. చిన్న పిల్లలు పెద్దవాళ్ళ గైడెన్స్ లో సినిమా చూడాలని దాని అర్థం. ఇక ఫ్యామిలీ స్టార్ చిత్ర నిడివి 2 గంటల 43 నిమిషాలు. 


Family Star Review

ఇక మూవీ చూసిన సెన్సార్ సభ్యులు తమ అభిప్రాయం తెలియజేశారు. అందుతున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ పై సెన్సార్ సభ్యులు పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. కామెడీ, ఎమోషన్, రొమాన్స్ చక్కగా కుదిరాయని అన్నారట. ముఖ్యంగా మృణాల్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ సీన్స్ కట్టిపడేస్తాయని అంటున్నారు. 

Family Star Review

మిడిల్ క్లాస్ కుర్రాడి పాత్రలో విజయ్ దేవరకొండ సహజంగా నటించాడట. ప్రేమికుడిగా, భర్తగా విజయ్ దేవరకొండ పాత్రలో భిన్నమైన షేడ్స్ ఉన్నాయట. గతంలో ఎన్నడు లేని విధంగా బీభత్సమైన ఫైట్స్ ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ చేశాడని అంటున్నారు. క్లైమాక్స్ భారీ ఫైట్ తో ముగుస్తుందట. 

Family Star Review

మృణాల్ ఠాకూర్ గ్లామర్, నటన మరో హైలెట్ అంటున్నారు. విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ అద్భుతం అట. మృణాల్ తెలుగు ప్రేక్షకులు గుర్తించుకునే మరో పాత్ర చేసిందని అంటున్నారు. దర్శకుడు పరశురామ్ రొమాంటిక్ సీన్స్ అల్లాడించాడట. గీత గోవిందం మ్యాజిక్ రిపీట్ చేశాడని అంటున్నారు. 

Family Star Review

నిర్మాణ విలువలు, సాంగ్స్, విజువల్స్ బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా విజయ్ దేవరకొండ హిట్ దాహం తీర్చే సినిమా అవుతుందని అంటున్నారు. ఫ్యామిలీ స్టార్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అంటున్నారు. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండకు ఆ రేంజ్ హిట్ పడలేదు... 

Latest Videos

click me!