ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదలైన పుష్ప మొదటి రోజు కేవలం మూడు కోట్ల వసూళ్లు అందుకుంది. అయితే వర్డ్ ఆఫ్ మౌత్ బాగుండటంతో పుష్ప రోజు రోజుకు పుంజుకుంది. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో పుష్ప హిందీలో హిట్ కొట్టింది. ఆ విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరాడు.