Vijay Devarakonda : ఫ్యాన్స్ కు పండుగ శుభాకాంక్షలు తెలిపిన లైగర్... సీతారాములతో లవకుశుల్లా విజయ్, ఆనంద్..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 15, 2022, 05:29 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన అభిమానులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పండుగ రోజు తన ఫ్యామిలీతో గడపి, పండుగ ప్రత్యేకతను చాటారు. తన అభిమానులు కూడా పండుగ రోజున ప్రత్యేకంగా ఫ్యామిలీతోనే గడపాలని సూచించారు.   

PREV
16
Vijay Devarakonda : ఫ్యాన్స్ కు పండుగ శుభాకాంక్షలు తెలిపిన లైగర్...   సీతారాములతో లవకుశుల్లా విజయ్, ఆనంద్..

తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందిన రౌడీ బౌయ్ మన విజయ్ దేవరకొండ. ముఖ్యంగా విజయ్ కి యూత్ ఫాలోయింగ్, అందులోనూ అమ్మాయిల ఫాలోయింగ్ వేరే లెవల్ ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాను ఎంతో శ్రద్ధ వహించి తీస్తున్నారు. అయితే గతేడాది నుంచి విజయ్ తన అప్ కమింగ్ మూవీ ‘లైగర్ సాలా క్రాస్ బ్రీడ్’(liger) కోసం శ్రమిస్తున్న విషయం తెలిసిందే. 

26

కాగా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ రోజు రౌడీ హీరో  విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపి, తెలుగు సంప్రదాయాల ప్రత్యేకతను చాటారు. నిజానికి పండుగ రోజు కుటుంబ సభ్యుల మధ్య గడిపితే మనకు తెలియకుండానే చాలా ఎనర్జీ మనలో నిండిపోతోంది. 
 

36

అదేవిధంగా పండుగలు ప్రశాంతతను, కుటుంబ సభ్యుల్లో ఐక్యతను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతాయి. ఈ క్రమంలో ఈ ఏడాది వచ్చిన మొదటి తెలుగు పండుగ సంక్రాంతిని విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో గడిపారు.

46

నాన్న  గోవర్దన్ రావు, తల్లి మాధవి, తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి పండుగ రోజును సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో తన ఫ్యాన్తో పండుగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. తన ప్రియమైన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలో విజయ్, ఆనంద్ దేవరకొండ (Anadh devarakonda) ట్రెడిషినల్ డ్రెస్ లు ధరించి సంప్రదాయం బద్ధంగా తయారయ్యారు. 
 

56

తమ గార్డెన్లో కుటుంబ సమేతంగా కూర్చొని కబుర్లు చెబుకుంటున్నారు. తమ ఇంట్లో తయారు చేసిన అల్పాహారం తింటూ కాలక్షేపం చేశారు. తమ ఇంట్లోని అరటిచెట్ల మధ్య నెలకొన్న వాతావరణంలో చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. తను షేర్ చేసిన ఫొటోలో తమతో ఫ్రెండ్లీగా గడుపుతున్న పెట్ ఉండటం ప్రత్యేకం. మొత్తంగా ఈ ఫ్యామిలీ చూడటానికి సీతారాములతో లవకుశుల్లా ఉన్నారు. 

66

ఇకపోతే ఇటీవలె పూరి జగన్నాథ్ (puri jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘లైగర్’కు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర యూనిట్ ఇటీవలె విడుదల చేసింది. ఇందులో వదలిన రెండు, మూడు డైలాగ్స్, సీన్స్ అద్భుతంగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఈ మూవీలో విజయ్ కి జంటగా అనన్యపాండే (Ananya Pandey) నటిస్తోంది. ఈ సినిమా కోసం ఇటు రౌడీ ఫ్యాన్స్, అటు పూరీ ఫ్యాన్స్ వేయి కండ్లతో  ఎదురు చూస్తున్నారు. 

click me!

Recommended Stories