టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ... స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ రూమర్స్ గట్టిగా స్ప్రెడ్ అవుతున్నాయి. గతం నుంచి ఈ రూమర్ గట్టిగానే నడుస్తున్నా.. ఈమధ్య ఆ ఇష్యూ పెద్దగా బయటకు రాలేదు. అయితే ఇప్పుడు కొత్త ఏడాది సందర్భంగా మరోసారి ఈ జంట మీద గాసిప్స్ గట్టిగా గుఫ్పుమన్నాయి. నూతన సంవత్సరం ఏదో ఒక ప్రకట చేయబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న ఈ ఇద్దరూ.. చెప్పుకోడానికి బెస్ట్ ఫ్రెండ్స్ మేము అని అంటున్నా.. అంతకుమింది వీరి మధ్య ఏదో ఉంది అనే అనేది సోషల్ మీడియా టాక్.