Rakhi Sawant: రాఖీ సావంత్ కి మైండ్ లేదు..ఆడేసుకుంటున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, దారుణంగా ట్రోలింగ్..

Published : Jul 25, 2022, 01:00 PM IST

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు.

PREV
16
Rakhi Sawant: రాఖీ సావంత్ కి మైండ్ లేదు..ఆడేసుకుంటున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, దారుణంగా ట్రోలింగ్..

రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. రాఖీ సావంత్ ఎక్కడ ఉంటె అక్కడ హంగామా మామూలుగా ఉండదు. 

26

రాఖీ సావంత్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఈ సారి ఆమెని టార్గెట్ చేసింది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ అభిమానులు రాఖీ సావంత్ ని ఎందుకు టార్గెట్ చేశారు అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళదాం. తన భర్త నుంచి విడిపోయాక రాఖీ సావంత్ మరో లవ్ ఎఫైర్ మొదలు పెట్టింది.  అదిల్ దురాని అనే వ్యక్తితో రాఖీ సావంత్ ప్రస్తుతం గాఢంగా ప్రేమలో మునిగితేలుతోంది.

36

రాఖీ సావంత్ కొన్ని వారాల క్రితం తన కొత్త ప్రేమ గురించి, ప్రియుడి గురించి అఫీషియల్ గా ప్రకటించింది. ప్రస్తుతం రాఖీ, ఆదిల్ తో కలిసి చెట్టాపలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ముంబైలో ఓ కార్యక్రమంలో రాఖీ సావంత్, ఆమె ప్రియుడు ఆదిల్ పాల్గొన్నారు. మొదట ఆదిల్ కారులో నుంచి బయటకి వచ్చేందుకు నిరాకరించాడట. అతడికి మీడియా అంటే కొంచెం సిగ్గు బిడియం ఉంది. 

46

దీనికి తోడు తాను రూ 200 చెప్పులు ధరించి ఉన్నానని, వీటితో మీడియాకి కనిపించడం బాగోదని చెప్పాడట. కానీ రాఖీ సావంత్ అతడిని ఒప్పించి తీసుకువచ్చింది. ఈ విషయాన్ని మీడియాకి తెలుపుతూ విజయ్ దేవరకొండ గురించి కామెంట్స్ చేస్తోంది. సౌత్ హీరో విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత చిత్రంలో నటిస్తున్నాడు. అతడే ఎలాంటి సిగ్గు లేకుండా ట్రైలర్ లాంచ్ లో రూ 200 చెప్పులతో కనిపించాడు. 

56

అంత పెద్ద హీరో, అంత పెద్ద నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న సినిమా ఈవెంట్ కి 200 రూపాయల చెప్పులతో వచ్చాడు. అలాంటప్పుడు నా ప్రియుడు 200 రూపాయల చెప్పులు ధరిస్తే తప్పేముంది. నా బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండకి ఏమాత్రం తీసిపోడు అంటూ కామెంట్స్ చేసింది. దీనితో నెటిజన్లు రాఖీ సావంత్ ని ఆడేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటి.. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ ని అతడితో పోల్చుకోవడం ఏంటి.. ఆమెకి దిమాక్ పనిచేయడం లేదు' అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

66

విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ చిత్ర ట్రైలర్ కి దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విజయ్, అనన్య పాండే కలసి ఈ చిత్రాల్లో నటిస్తున్నారు. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

click me!

Recommended Stories