Family Star Review:'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ..విజయ్, మృణాల్ ఓకే.. పరశురామ్ నమ్మకం నిలబెట్టుకున్నాడా

First Published Apr 5, 2024, 5:10 AM IST

తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. 

యువతలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి యువతలో ఉన్న ఆలోచనలకు తగ్గట్లుగా ప్రతి చిత్రంలో విజయ్ పెర్ఫామెన్స్ ఉంటోంది. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, మేనరిజమ్స్ యువతకి బాగా నచ్చేశాయి. అందుకే తక్కువ సమయంలోనే విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తాజాగా విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. 

దీనితో అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాకూర్ నటించింది. నేడు ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్, సాంగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీనితో మరో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ లోడింగ్ అంటూ అంచనాలు వినిపించాయి. మరి ఆ అంచనాలని ఈ చిత్రం అందుకుందో లేదో చూద్దాం. ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్ షోలు మొదలు కావడంతో ట్విట్టర్ లో జనాలు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పోస్ట్ చేస్తున్నారు. మూవీ ఎలా ఉందో చెబుతున్నారు. 

Latest Videos


ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అన్నట్లుగా సాగుతోంది అని నెటిజన్లు అంటున్నారు. కొన్ని వినోదాత్మక సన్నివేశాలు ఓకె. ఇక మిగిలిన భాగం ఏమాత్రం ఆకట్టుకోలేదు. టివి సీరియల్ ఫీలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో గుర్తుంచుకునేలా ఒక్క సీన్ కూడా లేదని అంటున్నారు. 

సెకండ్ హాఫ్ కూడా ఫన్ సీన్స్ తో మొదలవుతుంది. కానీ వెంటనే ఏమాత్రం ఆసక్తికరంగా లేని సన్నివేశాలు రిపీట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. గీతా గోవిందం కాంబినేషన్ ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది అని అంటున్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ ఒకే. కానీ దర్శకుడు పరశురామ్ అసలేం చెప్పదలుచుకున్నాడో పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. 

మరో నెటిజన్ పోస్ట్ చేస్తూ.. ఈ చిత్రానికి కమర్షియల్, మాస్ మూవీ అనే మైండ్ సెట్ తో వెళ్లొద్దు. ఫ్యామిలీస్ తో వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు. విజయ్ దేవరకొండ , మృణాల్ జోడి ఇంప్రెసివ్ గా ఉంది. బొమ్మ పక్కాగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని పోస్ట్ చేశారు. 

ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్. అమెరికాలో వచ్చే కొన్ని సీన్లు సిల్లీగా ఉన్నాయి. రెండు పాటలు మాత్రమే బావున్నాయి. బిట్స్ అండ్ పీసెస్ లాగా కామెడీ వర్క్ అయింది. ఓవరాల్ గా యావరేజ్ మూవీ అని మరో నెటిజన్ పోస్ట్ చేసాడు. 

మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావలసిన టైం ఇది. అతడి మ్యానరిజమ్స్ రిపిటీటివ్ గా అనిపిస్తున్నాయి. విజయ్ ఇకనైనా మంచి స్క్రిప్ట్స్ ఎంచుకోవాలి. ఫ్యామిలీ స్టార్ మూవీ వర్కౌట్ కావడం కష్టం అంటూ పోస్ట్ చేశాడు. 

మరో నెటిజన్ ఫస్ట్ హాఫ్ లో కాస్త ప్రెష్ నెస్ ఉంది. లీడ్ పెయిర్ మధ్య కొంతవరకు ఎంటర్టైన్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ పూర్తిగా పడిపోయింది. డైరెక్టర్ పరశురామ్ స్ట్రాంగ్ పాయింట్ తో కథని నడిపించలేకపోయారు. ఓవరాల్ గా ఫ్యామిలీ స్టార్ చిత్రానికి యావరేజ్ అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ చేయడంలో పరశురామ్ తడబడ్డట్లు అర్థం అవుతోంది. 

click me!