“ఫ్యామిలీ స్టార్” మొదట అనుకున్న టైటిల్ తో విజయ్ కు పర్శనల్ లింక్

Published : Apr 03, 2024, 01:01 PM IST

తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత వరకైనా వెళ్ళడానికి..తనని తాను తగ్గించుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తిగా కనిపిస్తున్నాడు విజయ్

PREV
111
  “ఫ్యామిలీ స్టార్” మొదట అనుకున్న టైటిల్ తో విజయ్ కు పర్శనల్  లింక్
Family Star Trailer


విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ . ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఈ చిత్రం విశేషాలు అంతటా హాట్ టాపిక్ గా మారాయి.  ఈ నేపధ్యంలో ఈ సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటనేది బయిటకు వచ్చింది. అలాగే  ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది.. ఎంత బడ్జెట్ పెట్టారు వంటి విషయాలు ట్రేడ్ లో చర్చగా మారాయి.
 

211
family star


తాజాగా విజయ్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అందులో భాగంగా ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ ఏంటో రివీల్ చేశాడు.  నిజానికి మేకర్స్ ఈ మూవీకి ముందుగా 'గోవర్ధన్'(Govardhan)అనే టైటిల్ని అనుకున్నారట.మరి ఈ టైటిల్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. దాన్ని చెప్పుకొచ్చారు. అదేంటంటే..విజయ్ దేవరకొండ తండ్రి పేరు కూడా గోవర్ధన్.
 

311


 ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పేరు గోవర్ధన్.ట్రైలర్లో చూస్తున్నట్టుగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ పనుల వరకు..తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడానికి ఎంత వరకైనా వెళ్ళడానికి..తనని తాను తగ్గించుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తిగా కనిపిస్తున్నాడు విజయ్. అలా కుటుంబానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్ కావడంతో గోవర్ధన్ లాంటి వాడు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఉన్నారు.అందుకే ముందుగా ఈ టైటిల్ని మేకర్స్ అనుకున్నారట. 
 

411


దాదాపు ఇదే టైటిల్ అనుకునేలోపు..పబ్లిక్కి మరింత దగ్గరగా అండ్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యే టైటిల్ పెడితే బాగుంటుందని పునరాలోచలనలో పడ్డారంట టీమ్. ఫ్యామిలీని సంతోషంగా ఉంచాలని అనుకునే ప్రతి వాడు ఒక ఆ ఫ్యామిలీకి స్టారే కదా..అని మేకర్స్ ఈ ఫ్యామిలీ స్టార్ క్యాచీ టైటిల్ ని ఫిక్స్ అయ్యారంట. టైటిల్ కు తగ్గట్లే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తీర్చిదిద్దారట.

511


యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టి చాలా టైం అవుతుంది, కానీ విజయ్ దేవరకొండ మూవీస్ కి బిజినెస్ పరంగా ఎప్పుడూ కూడా మంచి బిజినెస్ జరుగుతూనే ఉండటం విశేషం అని చెప్పాలి, లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఖుషి(Kushi Movie) తో వచ్చిన విజయ్ దేవరకొండ….

611


ఆ సినిమాతో పర్వాలేదు అనిపించినా హిట్ ని మాత్రం అందుకోలేదు. ఇక ఇప్పుడు తనకి గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరుశురామ్ తో కలిసి చేస్తున్న కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star Movie Pre Release Business) తో ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనుండగా… క్రేజీ కాంబోలో రూపొందినా కూడా రీజనబుల్ బిజినెస్ నే ఈ సినిమాకి చేశారు. నైజాంలో దిల్ రాజు ఓన్ గానే సినిమాను రిలీజ్ చేస్తున్నా కూడా ప్రీవియస్ మూవీస్ బిజినెస్ ల నుండి యావరేజ్ వాల్యూ బిజినెస్ ను కౌంట్ చేయగా ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ రేంజ్ ఈ విధంగా ఉంది….
 

711

#FamilyStar WW Pre Release Business(Valued)
👉Nizam: 13Cr(Valued)
👉Ceeded: 4.5Cr
👉Andhra: 17Cr
AP-TG Total:- 34.50CR
👉KA+ROI: 3Cr
👉OS – 5.5Cr
Total WW: 43CR(BREAK EVEN – 44CR~)

811


మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 43 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే 44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తో సాలిడ్ హిట్ ని ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని సాలిడ్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

911


 
మరో ప్రక్క  ఈ చిత్రం కథ ..చిరంజీవి సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడ‌ర్‌’కు పోలిక ఉంటుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ‘గ్యాంగ్ లీడ‌ర్‌’మాదిరిగానే ఈ సినిమాలో  ఇద్ద‌రు అన్న‌ల  త‌మ్ముడిగా  విజ‌య్ కనిపిస్తారు. అలాగే గ్యాంగ్ లీడర్ లో  చిరు ఇంట్లోకి విజ‌య‌శాంతి రెంట్‌కి దిగి.. ప్రేమ‌లో ప‌డే ఎపిసోడ్ ఉంటుంది. ఇక్కడ  ఈ సినిమాలోనూ విజ‌య్ ఇంట్లో మృణాల్ అద్దెకు దిగి, ప్రేమ‌లో ప‌డుతుందని అంటున్నారు. అయితే ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో  ప్రత్యేకమైన  విల‌న్ , రివైంజ్ ఉంటంది. 

1011


ఇక్క‌డ మాత్రం కథ మాత్రం ‘గీత గోవిందం’తరహాలో సాగుతుందని, ఆమె పైనే హీరో  సరదాగా రివేంజ్ తీర్చుకుంటాడని , ఆ క్రమంలో వచ్చే కామెడీ, ఎమోషన్ సినిమాకు సినిమాని నిలబడతాయని నమ్ముతున్నారట. ‘గీత గోవిందం’కు ఓ వెర్షన్ లా గ్యాంగ్ లీడర్ స్క్రీన్ ప్లే డిజైన్ లో సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఏదైమైనా రెండూ సూపర్ హిట్స్ కాబట్టి ఈ సినిమా కూడా అదే స్దాయిలో వర్కవుట్ కావచ్చు. 

1111


 
ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల.
 

click me!

Recommended Stories