పేరు మార్చుకోబోతున్న విజయ్ దేవరకొండ..? సంచలన నిర్ణయానికి కారణం ఏంటి...?

First Published | Jun 11, 2024, 2:53 PM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి పెద్ద సాహసం చేయబోతున్నాడా..? తన పేరును ఆయన మార్చుకోవాలని నిర్ణయించుకున్నారా..? ఇష్టం లేకపోయినా ఈ పనిచేయడానికి విజయ్ సాహసిస్తున్నారా..? ఇంతకీ దానికి కారణం ఏంటి..? ఇందులో నిజం ఎంత..? 

విజయ్ దేవరకొండ...ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి. వరుసగా ప్లాప్ లు చూస్తున్నా..ఆ వైబ్రేషన్స్ లో ఎటువంటి మార్పు లేదు. ఫ్యాన్స్ కాని.. ఫాలోయింగ్ కాని ఏమాత్రం తగ్గడంలేదు విజయ్ కి. విజయ్ దేవరకొండ అంటే ఇప్పటికీ పడిచచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనన చూస్తే చాలు అనుకునే లేడీ ప్యాన్స్ బోలెడు మంది. కాని వారికోసం ఒక్క హిట్ సినిమా ఇవ్వలేకపోతున్నాడు రౌడీ హీరో. 
 

నిజానికి గీత గోవిందం తరువాత విజయ్ కు సాలిడ్ హిట్ పడిందే లేదు. టాక్సీవాల సినిమా మాత్రం కాస్త బాగుంది అనిపించింది. ఆతరువాత వచ్చిన ఏ సినిమా విజయ్ కెరీర్ కు ఉపయోగపడలేదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని.. పూరీ జగన్నాథ్ చేసిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన ఈసినిమా కనిపించకుండా పోయింది. 
 


ఇక ఆతరువాత వచ్చిన ఖుషి కాని, రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కాని.. ఏమాత్రం రిలాక్స్ ను ఇవ్వలేదు విజయ్ దేవరకొండకు. దాంతో విజయ్ తీవ్రమైన ఆలోచనల్లో పడ్డాడట. ఏం చేస్తే హిట్ కొడతామా అని ఆలోచిస్తున్నాడట. మాస్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి..ఫ్యామిలీ సినిమాలు చేస్తున్నా కాని.. ఏమాత్రం లాభలే కుండా పోతోంది. అందుకే విజయ్ దేవరకొండ ఓ నిర్ణయం తీసుకుంటున్నట్ట తెలుస్తోంది. అది కూడా ప్యామిలీ ఒత్తిడితోనే చేస్తున్నాడట. 
 

విజయ్ కు హిట్లు లేకపోయినా..ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ముందు ముందు కూడా ఇలానే ఉంటుంది అని చెప్పలేము అందుకే.. విజయ్ గురించి ఆలోచించిన వారి పేరెంట్స్.. విజయ్ జాతకం చూపించారట. విజయ్ దేవరకొండ తల్లి ఆయన జాతకం చూయించిందట . ఈ క్రమంలోనే పేరులో మార్పులు చేసుకోవాలి అంటూ సజెస్ట్ చేశారట . అలాంటివి నమ్మకపోయినా ఇష్టం లేకపోయినా సరే విజయ్ దేవరకొండ తన తల్లి కోసం పేరు మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. 

Vijay Devarakonda

మొదటి నుంచి తల్లిదండ్రుల మాటలకు విలువిస్తారు విజయ్. ముఖ్యంగా అమ్మ అంటే విజయ్ కు ప్రాణం. అందుకే  విజయ్ దేవరకొండ ఇప్పుడు తల్లి ఆనందం కోసం తన పేరును మార్చుకోబోతున్నాడు అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. 
 

విజయ్ దేవరకొండ పేరు ఇండస్ట్రీలో గట్టిగా రిజిస్టర్ అయిపోయింది. ఈపేరులో ఉండే వైబ్రేషన్స్ ను యూత్ బాగా అలవాటు చేసుకున్నారు. ఒక వేళ విజయ్ నిజంగానే పేరు మార్చుకుంటే.. ఆ ఫీల్ ను వాళ్ళు మిస్అయ్యే అవకాశం ఉంది. అయితే నిజంగా విజయ్ దేవరకొండ పేరు మార్చుకుంటే.. అదృష్టం కలిసి వస్తుందా లేదా.. ఇదంతా ఫేక్ న్యూస్ ఆ.. చూడాలి మరి. 

Latest Videos

click me!