దాని కోసం ఏదైనా చేస్తాను... మీరు నన్ను ఆ యాంగిల్ లోనే చూస్తున్నారు, గుప్పెడంత మనసు జగతి ఓపెన్ కామెంట్స్ 

First Published Jun 11, 2024, 2:33 PM IST

గుప్పెడంత మనసు జగతిగా తెలిసిన జ్యోతిరాయ్ ఇమేజ్ వేరు. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో ట్రోల్స్ కి గురవుతుంది. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ పై జ్యోతిరాయ్ స్పందించారు. 
 


జ్యోతిరాయ్ సోషల్ మీడియా హాట్ బాంబుగా అవతరించిన సంగతి తెలిసిందే. తెలుగు ఆడియన్స్ ఆమె తీరుకు అవాక్కు అయ్యారు. సీరియల్ నటిగా ఆమెకున్న ఇమేజ్ రీత్యా ఓవర్ ఎక్స్పోజ్డ్ లుక్ వైరల్ అయ్యింది. 

స్టార్ మా సూపర్ హిట్ సీరియల్స్ లో గుప్పెడంత మనసు ఒకటి. ఆ సీరియల్ లో హీరో రోల్ రిషికి తల్లైన జగతి పాత్ర చేసింది జ్యోతిరాయ్. మిడిల్ ఏజ్ హోమ్లీ రోల్ లో జ్యోతిరాయ్ మెస్మరైజ్ చేసింది. ఆమె లుక్ నిజమైన ఒక తల్లిని గుర్తు చేసేది. అనూహ్యంగా జగతి పాత్రను సీరియల్ నుండి తొలగించారు. ఆ పాత్రను చంపేశారు. 
 

సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీ అయిన కారణంగా జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకుంది. అయితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఏకంగా బికినీలు ధరించి ఆమె బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ట్రోల్ ఎదురయ్యాయి. 

సదరు ట్రోల్స్ పై తాజాగా జ్యోతిరాయ్ స్పందించారు.  'ఏ మాస్టర్ పీస్' మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ట్రోల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము. మోడరన్ రోల్స్ వస్తే వాటికి తగ్గట్లుగా, ట్రెడిషనల్ రోల్ వస్తే అందుకు తగ్గట్లుగా తయారు అవుతాము. 

ఇక నన్ను ట్రోల్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే అది వాళ్ళ మెంటాలిటీ, వ్యక్తిత్వం. వాళ్ళు ట్రోల్ చేస్తారని నేను ఫోటోలు పెట్టడం లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ సోషల్ మీడియా ద్వారానే నడుస్తుంది. మనం ట్రెండ్ ని ఫాలో కావాల్సిందే. నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు. 

Jyothi rai Jyothi Poorvaj

మీరు నన్ను గుప్పెడంత మనసు జగతి క్యారెక్టర్ లోనే చూస్తున్నారు. కానీ నేను అంతకు ముందు ఓ షో 60 ఎపిసోడ్స్ మోడరన్ డ్రెస్సుల్లో చేశాను. అది మీకు తెలియదు... అని అన్నారు. ప్రొఫెషన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పదని, పాత్రకు తగ్గట్లు మారతామని జ్యోతిరాయ్ చెప్పకనే చెప్పింది. 

కాగా ఏ మాస్టర్ పీస్ మూవీకి జ్యోతిరాయ్ భర్త సుకు పూర్వాజ్ దర్శకుడు. ఈ సూపర్ హీరో చిత్రంలో అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్నాడు. అషురెడ్డి, స్నేహ గుప్త హీరోయిన్స్. జ్యోతిరాయ్ ఓ కీలక రోల్ చేస్తుంది. 

Latest Videos

click me!