సమంత సమక్షంలో విజయ్‌ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్‌.. సామ్‌, పూరీ పవర్‌ఫుల్‌ విషెస్‌

Published : May 09, 2022, 10:03 AM ISTUpdated : May 09, 2022, 12:37 PM IST

విజయ్‌ దేవరకొండ నేడు తన 33వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అయితే సమంత సమక్షంలో అర్థరాత్రి విజయ్‌ బర్త్ డే వేడుకలు జరగడం విశేషం. సమంత, పూరీ స్పెషల్‌ విషెస్‌ తెలిపారు.

PREV
16
సమంత సమక్షంలో విజయ్‌ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్‌.. సామ్‌, పూరీ పవర్‌ఫుల్‌ విషెస్‌

టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌ విజయ్‌ దేవరకొండ(Vijay Devarkonda). హీరోయిజానికి, యాటిట్యూట్‌కి కొత్త అర్థాన్ని చెప్పిన స్టార్‌. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఒక్కసారిగా స్టార్‌ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. `పెళ్లి చూపులు`, `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం` బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ తో టాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. టాప్‌ స్టార్స్ జాబితాలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సోమవారం(మే9)న ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 33వ బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు రౌడీ బాయ్‌. HBD Vijay Devarakonda.

26

విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు వేడుకలు (Viajy Devarakonda Birthday Celebrations) సమంత(Samantha) సమక్షంలో జరగడం విశేషం. సమంతతో కలిసి ఆయన `వీడీ11` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగానే అర్థరాత్రి విజయ్‌ దేవరకొండ బర్త్ డేనిసెలబ్రేట్‌ చేశారు. 

36

ఇందులో సమంత, దర్శకుడు శివ నిర్వాణ, చిత్ర యూనిట్‌ ఉంది. విజయ్‌ చేత కట్‌ చేయించారు. ఆయనకు గుర్తిండిపోయేలా బర్త్ డే విషెస్‌ తెలిపారు. ఇదిలా ఉంటే అంతకు ముందే, ఆదివారం సాయంత్రం విజయ్‌ దేవరకొండ బర్త్ డే సీడీపీని సమంత విడుదల చేయడం విశేషం. 

46

విజయ్‌ దేవరకొండకి సమంత బర్త్ డే విషెస్‌ తెలిపింది. రాబోయే ఈ సంవత్సరం అందరి ప్రేమకి, అనేక ప్రశంసలకు మీరు అర్హులు. మీ వర్క్ ని దగ్గరుండి చూడటం ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొంది సమంత. `వీడీ11` షూటింగ్‌లో రాత్రి విజయ్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ టైమ్‌లో ఆయనతో కలిసి దిగిన ఫోటోని పంచుకుంది సమంత. ఇవి వైరల్‌ అవుతున్నాయి. 

56

మరోవైపు విజయ్‌కి ఇండస్ట్రీ నుంచి వరుసగా బర్త్ డే విషెస్‌లు వెల్లువెత్తుతున్నాయి. అందులో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) చెప్పిన విషెస్‌ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.  `నేను నీ హార్ట్ లోని ఫైర్‌ చూశా. నీ లోపల ఉన్న ఫైన్‌ యాక్టర్‌ని చూశా. నీ మైండ్‌లో ఏం ఏముందో నాకు తెలుసు. నీ ఆకలి, నీ మ్యాడ్‌నెస్‌, నీ కమిట్‌మెంట్‌, నీ హంబుల్‌నెస్‌ అన్ని నిన్ను ఓ స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. ఒకరోజు నువ్వు దేశం గర్వించే వ్యక్తిగా నిలుస్తావు. అప్పుడు నేను నిన్ను పిలుస్తాను ది విజయ్‌ దేవరకొండ. హ్యాపీ బర్త్‌ డే` అని అంటూ పవర్‌ఫుల్‌ నోట్‌ని పంచుకున్నారు పూరీ జగన్నాథ్‌. ఇది వైరల్‌ అవుతుంది. 

66

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ రెండు సినిమాలు చేస్తున్నారు. `లైగర్‌` చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. తెలుగులోకి ఆమె ఎంట్రీ ఇస్తుంది. మరోవైపు పూరీతో మరో సినిమాని ప్రకటించారు విజయ్‌. `జనగణమన` చిత్రం చేయబోతున్నట్టు వెల్లడించారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories