ఇంటర్నేషనల్ వేదికపై రౌడీ హీరో... లైగర్ ఫెయిల్ అయినా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టారే!

First Published Aug 28, 2022, 8:22 PM IST

లైగర్ మూవీతో విజయ్ ఇమేజ్ పదింతలు పెరుగుతుందని అనుకున్నారు. అయితే మూవీ డిజాస్టర్ కావడంతో ఆయన విమర్శల పాలవుతున్నారు. అయితే ఆయన ఇమేజ్ కి ఏమాత్రం ఢోకా లేదని తాజా సంఘటన తెలియజేస్తుంది. ఏకంగా విజయ్ ఇంటర్నేషనల్ వేదికపై ప్రత్యక్షమయ్యారు.


లైగర్ ఫలితం నిజంగా విజయ్ దేవరకొండకు దర్శకుడు పూరి జగన్నాధ్ కి పీడకలని చెప్పాలి. ఈ రేంజ్ డిజాస్టర్ వాళ్ళు ఊహించలేదు. సినిమా గురించి ఓ రేంజ్ లో డబ్బా కొట్టారు. విజయ్ అయితే ఏకంగా రెండు వందల కోట్లకు పైమాటే అన్నారు. ఇండియా షేక్ అవుతుంది అన్నాడు. పూరి కూడా ఏం తక్కువ తినలేదు. లైగర్ అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులకు హామీ ఇచ్చారు. 

తీరా థియేటర్స్ లోకి వచ్చాక ఫలితం తారుమారైంది. అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయింది.ఒక పాట, ఫైట్ అన్నట్లు సినిమా ఇష్టం వచ్చినట్లు తీశారన్న విమర్శలు వినిపించాయి. క్రిటిక్స్ తో పాటు ప్రేక్షకులు ఏకిపారేశారు. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ లైగర్ టీం ఎదుర్కొంది.

అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ ఇమేజ్ ఇంచు కూడా తగ్గలేదని తెలుస్తుంది. మూవీ విడుదల తర్వాత కూడా ఆయన హాజరవుతున్న వేదికల వద్ద ఫ్యాన్స్ ని చూస్తే అర్థం అవుతుంది. నేడు విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లారు. అక్కడ లైగర్ ప్రమోషన్స్ నిర్వహించారు. ప్రేక్షకుల నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది.
 


అలాగే విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ వేదికపై  మెరిశాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఆయన హాజరయ్యారు. క్రికెట్ గ్రౌండ్ లో కామెంటేటర్ల తో పాటు ముచ్చటించారు. ఆ మ్యాచ్ లో  ఆయనకు ప్రాతినిధ్యం దక్కింది. ఇండియన్ ట్రెడిషనల్ వేర్ అయిన పైజామా ధరించి విజయ్ మాట్లాడిన మాటలు ఇండియన్స్ ని ఆకట్టుకున్నాయి. 


అందులోనూ దాయాదులు ఇండియా, పాకిస్తాన్ తలపడుతున్న  మ్యాచ్ కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసియా కప్ 2022లో మొదటిసారి ఈ రెండు జట్లు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పోరులో ఇండియా విజయం సాధించాలని విజయ్ దేవరకొండ కోరుకున్నారు.


విజయ్ దేవరకొండకు దొరికిన ఈ అరుదైన అవకాశం చూస్తే ఆయన్ని పాన్ ఇండియా స్టార్ కాదనలేమనిపిస్తుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్పొచ్చు. అలాగే లైగర్ రిజల్ట్ ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపలేదని చెప్పొచ్చు.

click me!