నెటిజన్ దారుణమైన ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి

First Published Aug 28, 2022, 7:24 PM IST

ఆ మధ్య సెలబ్రిటీలను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేయడం నెటిజన్లకు బాగా అలవాటు అయ్యింది. నోటికి ఏది అనిపిస్తే.. అది అడిగేస్తున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ పునర్నవికి కూడా ఇలాంటి ప్రశ్నే ఏదురయ్యింది..? ఇక ఆ నెటిజన్ దిమ్మతిరిగేలా సమాధానం చెప్పింది బ్యూటీ. 

పునర్నవి గ్లామర్‌ ఫోటోలు.

పునర్నవి భూపాలం చాలా కాలం అయ్యింది ఈపేరు విని. తెలుగు బిగ్‌బాస్‌ రియాల్టీ షో ద్వారా పాపులర్‌ అయిన నటి గతంలో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కాని ఆమెకు తగిన  గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్‌  సీజన్ 3లో ఆమె సందడి చేసింది. ఆతరువాత  ఆమకు ఆఫర్లు వచ్చినా.. స్క్రీన్ కు దూరంగా ఉంటోంది. 

స్క్రీన్ కు దూరం అయినా.. సోషల్ మీడియాను మాత్రం వదలడంలేదు పున్ను. రీసెంట్ గా ఆమె  ఇన్‌ స్టా లైవ్‌లోకి వచ్చింది . కొన్ని షాకింగ్ విషయాలు నెటిజన్లతో పంచుకుంది  పునర్నవి. ముఖ్యంగా  తన డేటింగ్‌ విషయంపై స్పందించింది. మీరు ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా? అని ఓనెటిజన్‌ అడగంగానే.. తడుముకోకుండా  ఎస్‌ అని అన్సర్‌ ఇచ్చింది. 
 

ఇక మరో నెటిజన్ ఆమెను ఇబ్బంది పట్టాలని చూశాడు..  మీరు వర్జిన్‌ నా? అని అడిగేశాడు ఆమెను. ఇక వెంటనే .. పునర్నవి మొహమాటం లేకుండా నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నానని సమాధానం చెప్పింది. దాంతో ఏం సమాధాణం చెప్పలేక పోయాడు నెటిజన్. ఇలా చాలా రకాలుగా ఆమెను కొంత మంది నెటిజన్లు ఇబ్బంది పెట్టాలని చూశారు. 

ప్రస్తుతం ఈ  ఈ చిట్‌ చాల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఏ విషయంలోనైనా ఫేస్ టూ ఫేస్ ఉంటుంది పునర్నవి.  ఓపెన్‌గా మాట్లాడుతుంది. బోల్డ్‌ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్‌ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి తన చదువుల పై దృష్టి పెట్టింది. ఆమె ప్రస్తుతం లండన్‌ వెళ్లింది.
 

ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీ హయ్యర్‌ స్లడీస్‌ చేస్తోంది. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బోల్డ్‌ బ్యూటీ. అప్పుడప్పుడు సోషల్ మీడియా లైవ్స్ పెట్టి.. తన అభిమానులతో మాట్లాడుతుంటుంది. 
 

ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీ లో హై స్లడీస్‌ చేస్తోంది. అందుకే ఈ మధ్య ఆమె ఏ సినిమాల్లో కాని..బుల్లి తెర ఈవెంట్స్ లో కాని కనిపించలేదు. సినిమాల ద్వారా కాకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా అయినా అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ బోల్డ్‌ బ్యూటీ. 

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపించింది చిన్నది. వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారేమో  అన్నంతలా డీప్ కు వెళ్ళిపోయారు. కాని హౌస్ బాయటకు రాగానే ఎవరి దారి వారు చూసుకున్నట్టు తెలుస్తోంది. రాహుల్ మాత్రం అష్షు రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్టు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. 

click me!