కూతురి కోసం కొన్న చెప్పులు ఇంట్లో అలానే ఉన్నప్పుడు, ఇకపై తాను కూడా చెప్పులు వేసుకోకూడదని విజయ్ ఆంటోనీ నిర్ణయించుకున్నట్లు ఫాతిమా తెలిపారు. కూతురి జ్ఞాపకాలను ఎప్పటికీ తనతోనే ఉంచుకోవాలనే ఓ తండ్రి ఆవేదనగా ఈ నిర్ణయాన్ని చూడొచ్చు.
సినిమాల్లో రకరకాల పాత్రలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న విజయ్ ఆంటోనీ జీవితంలో.. ఇంతటి లోతైన బాధ ఉందనే విషయం అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా కూతురి కోసం కొన్న చెప్పులను, వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఆయన ఇప్పటికీ మనసులో మోస్తుండటం ఫ్యాన్స్‌ను కంటతడి పెట్టిస్తోంది.
ఫాతిమా చెప్పిన ఈ ఎమోషనల్ విషయాలు వైరల్ కావడంతో, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా విజయ్ ఆంటోనీ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు. ఓ తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేమనే విషయాన్ని ఈ సంఘటన రుజువు చేస్తోంది.