బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా..
డి. రామానాయుడు నిర్మించిన బెండు అప్పారావు RMP సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ, ఎమోషన్స్, తో ఈమూవీ కథ, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లరి నరేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే.. ఆడియన్స్ కదలకుండా చూస్తుంటారు.
నటనకు మించి నిరూపించుకున్న ప్రతిభ
సాధారణంగా ఒక సినిమాలో హీరోగా నటించడం ఒక బాధ్యత అయితే, అదే సినిమాకు దర్శకత్వ పరమైన బాధ్యతలు నిర్వర్తించడం మరో పెద్ద సవాలు. ముఖ్యంగా షూటింగ్ చివరి దశలో ఇలాంటి బాధ్యతలు చేపట్టడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో నరేష్ ముందుకొచ్చి సినిమా పూర్తయ్యేలా సహకరించడం ఆయనలోని బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.