Srinu Vaitla: ప్రకాష్‌ రాజ్‌తో గొడవ, అసలు నిజాలు బయటపెట్టిన శ్రీనువైట్ల.. అందుకే మహేష్‌ మూవీ నుంచి తప్పించారా?

Published : Nov 17, 2026, 06:43 PM IST

Srinu Vaitla: ప్రకాష్‌రాజ్‌తో గొడవ విషయంపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించారు. అసలు అప్పుడు ఏం జరిగిందో తెలిపారు. ప్రకాష్‌ రాజ్‌పై తాను ఎందుకు ఫైర్‌ కావాల్సి వచ్చిందనేది క్లారిటీ ఇచ్చారు.

PREV
14
ప్రకాష్‌రాజ్‌, శ్రీనువైట్ల మధ్య గొడవ ఏంటంటే?

ప్రకాష్‌ రాజ్‌ విలక్షణ నటుడు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు. పాత్రకి ప్రాణం పోస్తాడు. అయితే మహేష్‌ బాబు నటించిన `ఆగడు` సినిమా సమయంలో దర్శకుడు శ్రీనువైట్లతో గొడవ జరిగింది. దీంతో ఈ మూవీ నుంచి ప్రకాష్‌ రాజ్‌ని తప్పించారు. అదే సమయంలో ప్రకాష్‌ రాజ్‌పై శ్రీనువైట్ల ఫైర్‌ అయ్యారట. మరి ఇంతకి ఏం జరిగిందనేది దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

24
గొడవపై క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల

శ్రీనువైట్ల మాట్లాడుతూ, ప్రకాష్‌ రాజ్‌ బ్రిలియంట్‌ యాక్టర్‌. ఆ విషయంలో ఎవరు ఏం చెప్పడానికి లేదు. కాకపోతే సినిమా తీసేది నేను. ఏ సీన్‌ ఎలా తీయాలి, ఏ పాత్ర ఎలా బిహేవ్‌ చేయాలనేది నాకు తెలుసు, అదే మూడ్‌లో నేను ఉంటాను. అదే విషయాన్ని ప్రకాష్‌ రాజ్‌కి చెప్పాను, ఇలా, అలా చేయాలని చెప్పాను, కానీ ఆయన కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ ఫ్రస్టేషన్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని తిట్టాడు. అది నాకు చాలా బాధ కలిగించింది. ఫీల్‌ అయ్యాను. దీంతో సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మేం మాట్లాడుకున్నాం, ఇప్పుడు అంతా బాగానే ఉన్నాం` అని అలీతో సరదాగా షోలో వెల్లడించారు శ్రీనువైట్ల.

34
అసలేం జరిగిందంటే?

అసలు గొడవ ఏంటనేది చూస్తే, మహేష్‌ బాబు హీరోగా శ్రీనువైట్ల `దూకుడు` సినిమా చేశారు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మహేష్‌ బాబు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లోనే `ఆగడు` మూవీ పట్టాలెక్కింది. ఇందులోనూ ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు. షూటింగ్‌ కూడా స్టార్ట్ అయ్యిందట. మొదటి రోజు సెట్‌లో సీన్‌ తీస్తున్నప్పుడు శ్రీనువైట్ల తనకు నచ్చినట్టుగా నటించాలని చెప్పారట, ఆ విషయంలో ప్రకాష్‌ రాజ్‌ ఇబ్బంది పడ్డారు, డైరెక్ట్ గా ఆయనపై కోప్పడకుండా అసిస్టెంట్‌ సూర్యపై ఫైర్‌ అయ్యాడట ప్రకాష్‌ రాజ్‌. ఈ విషయం తెలిసి శ్రీనువైట్ల కూడా గట్టిగా రియాక్ట్ కావాల్సి వచ్చిందని, దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సినిమా నుంచి ప్రకాష్‌ రాజ్‌ని తప్పించానని శ్రీనువైట్ల తెలిపారు. కానీ శ్రీను వైట్లతో క్రియేటివ్‌ డిఫరెన్స్ రావడంతో తానే సినిమా నుంచి తప్పుకున్నానని ప్రకాష్‌ రాజ్‌ చెప్పారు. కేవలం ఒకరోజు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపారు.

44
ఒకరిపై ఒకరు కౌంటర్లు

తనపై వచ్చిన దురుసు ప్రవర్తన ఆరోపణలను కూడా ప్రకాష్‌ రాజ్‌ ఖండించారు. సినిమా నుంచి తప్పించిన తర్వాత ప్రకాష్‌ రాజ్‌ మీడియా సమావేశంలో ఒక కవిత చదివారు. తనను పరిశ్రమ నుంచి పంపించాలని చూసినా, తనను దెబ్బతీయాలని ప్రయత్నించినా మరింత బలంగా ఎదుగుతాననే భావన ఆ కవితలో ఉంది. కానీ `ఆగడు` సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ స్థానంలో వచ్చిన సోనూ సూద్‌తోనే ఆ కవితను డైలాగ్‌గా చెప్పించాడు శ్రీనువైట్ల. దీంతో ప్రకాష్‌ రాజ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి తీసుకోకుండా, కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన కవితను సినిమాలో ఉపయోగించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.

దీనికి శ్రీనువైట్ల సమాధానమిస్తూ, ప్రకాష్‌ రాజ్‌ తన మీడియా సమావేశంలో ఆ కవితను తనకు అంకితం చేసినట్లుగా భావించానని, అందుకే సినిమాలో ఉపయోగించానని చెప్పారు. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సెట్‌ అయినట్టు సమాచారం. శ్రీనువైట్ల కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత శ్రీనువైట్ల రూపొందించిన ఈ సినిమాలోనూ ప్రకాష్‌ రాజ్‌ నటించకపోవడం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories