విడాకుల దిశగా విజయ్ ఆంటోని ?.. భార్యతో బిచ్చగాడు హీరో విభేదాలు, మూడో వ్యక్తి వద్దు అంటూ..

Published : Oct 13, 2022, 04:45 PM IST

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు.

PREV
16
విడాకుల దిశగా విజయ్ ఆంటోని ?.. భార్యతో బిచ్చగాడు హీరో విభేదాలు, మూడో వ్యక్తి వద్దు అంటూ..

సైలెంట్ గా వచ్చిన బిచ్చగాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో విజయ్ ఆంటోనికి మంచి క్రేజ్ వచ్చింది. అంతకు ముందు విజయ్ కొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ విజయ్ ఆంటోని అంటే ఎవరో చాలా మందికి తెలియదు. బిచ్చగాడు తర్వాతవిజయ్ ఆంటోని నటించిన చిత్రాలకు ఆ క్రేజ్ క్యారీ ఫార్వార్డ్ అవుతూ వచ్చింది. 

26

కానీ కొన్ని చెత్త సినిమాలు పడడంతో విజయ్ ఆంటోనీ ప్రభావం ఇటీవల తగ్గింది. అయినప్పటికీ విజయ్ ఆంటోనీ తన పంథాలో విభిన్నమైన చిత్రాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా విజయ్ ఆంటోని పర్సనల్ లైఫ్ మీడియాలో హిట్ టాపిక్ గా మారింది. 

36

గత కొంతలంగా విజయ్ ఆంటోనీ, అతని భార్య ఫాతిమా మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయట. ఇద్దరూ కలసి ఉండడం లేదని రూమర్స్ వినిపించాయి.  తాజాగా విజయ్ ఆంటోనీ చేసిన ట్వీట్ తో ఆ అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. 

46

'మీ కుటుంబంలో సమస్య వస్తే మీరే పరిష్కరించుకోవాలి. మీ ఇద్దరూ పరిష్కరించుకోలేకపోతే ఇల్లు వదిలిపెట్టి విడిగా జీవించాలి. అంతేకాని మీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి. ఎందుకంటే వారు మీ సమస్యని పరిష్కరించరు. 

56

పైగా మీ నాశనాన్ని చూసి ఆనందిస్తారు అంటూ విజయ్ ఆంటోని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనితో విజయ్ ఆంటోనీ వ్యక్తిగత జీవితం గురించి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. భార్య ఫాతిమాతో వచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని ఇలా పరోక్షంగా చెబుతున్నాడా ? విజయ ఆంటోనీ జీవితం విడాకుల దిశగా వెళుతోందా అనే సందేహాలు మొదలయ్యాయి. వీరిద్దరికి 2006లో వివాహం జరిగింది. 

66

విజయ్ ఆంటోనీ, ఫాతిమా దంపతులకు ఒక కుమార్తె సంతానం కూడా ఉంది. విజయ్, ఫాతిమా ఇద్దరూ విడిపోకుండా సంతోషంగా జీవించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలో జరుగుతున్న విడాకులు అభిమానులకు షాకింగ్ గా మారుతున్నాయి. సమంత నాగ చైతన్య.. ధనుష్ ఐశ్వర్య ఇలా స్టార్ కపుల్స్ విడిపోయారు. 

 

click me!

Recommended Stories