దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాలివే.. ఈ సారి సందడి యంగ్ హీరోలదే!

Published : Oct 13, 2022, 04:43 PM ISTUpdated : Oct 20, 2022, 06:07 PM IST

దీపావళి కానుకగా తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలు నటించిన చిత్రాలతో పాటు.. తెలుగు లో రూపొందుతున్న సినిమాలు పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించబోతున్నాయి. 

PREV
16
దీపావళి కానుకగా థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాలివే.. ఈ సారి సందడి యంగ్ హీరోలదే!

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ఓరి దేవుడా` (Ori Devuda). చివరిగా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’తో విజయాన్ని అందుకుని.. ప్రస్తుతం `ఓరి దేవుడా`తో వస్తున్నారు. ఎప్పుడో రిలీజ్‌ కావాల్సిన ఈసినిమా ఇప్పుడు దీపావళికి కానుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 21న విడుదల చేస్తున్నారు. వెంకటేష్‌, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గెస్ట్ రోల్స్ చేశారు. ఇటీవల వచ్చిన ట్రైలర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.
 

26

తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ 'ప్రిన్స్' (Prince). శివకార్తికేయన్ (Siva Karthikeyan), మారియా  హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. ఇండియాలోని పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో రూపొందుతోంది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కూడా అక్టోబర్ 21నే ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. 
 

36

డైనమిక్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా' (Ginna). అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కూడా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 21నే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అవుతోంది.  హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput), సన్నీ లియోన్ గ్లామర్ రోల్ లో కనువిందు చేయనున్నారు. విష్ణు ‘జిన్నా’తో మంచి జోష్ గా వస్తున్నారు. 
 

46

తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తమిళ హీరో కార్తీ (Karthi) నటించిన లేటెప్ట్ యాక్షన్ - స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘సర్దార్’ కూడా  దీపావళి కానుకగా రాబోతోంది. ఈ చిత్రం  కూడా అక్టోబర్ 21నే థియేటర్లలో అడుగు  పెట్టబోతోంది. పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. 

56

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ (Satya Dev) నటించిన బాలీవుడ్ ఫిల్మ్ ‘రామ్ సేతు’ (Ram Setu) కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది.  తెలుగులోనూ అదే రోజు గ్రాండ్ గా విడుదలవుతోంది. 
 

66

ఇప్పటికే వరుసగా హిట్స్ అందుకున్నంటున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చిత్ర ప్రమోషన్స్ కూడా క్రేజీగా నిర్వహిస్తున్నారు. ఇక మంచు విష్ణు కూడా వింటేజ్ క్రేజ్ ను దక్కించుకునేలా కనిపిస్తున్నారు. ‘జిన్నా’లో విష్ణు సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ మంచి రెస్పాన్సే దక్కింది. ఇక సత్యదేవ్, కార్తి, శివకార్తికేయ కూడా తమ సినిమాలతో అలరించబోతున్నారు. ఇప్పటికే దసరా కానుకగా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దసరాకు సీనియర్ హీరోల కోటా కంప్లీట్ అవ్వడంతో.. ఇక దీపావళికి యంగ్ హీరోలు దుమ్ములేపనున్నారు.  

click me!

Recommended Stories