ఈ అవమానంవల్ల అప్పుడు తాను ఏసినిమాలకు సంతకం చేయలేకపోయానంటోంది. సినిమాలు చేయాలనుకున్న కుదరలేదు. అంతలా ఆ నిర్మాత తీరు తనపై ప్రభావం చూపింది అంటూ చెప్పుకొచ్చింది.అదే సమయంలో కె బాలచందర్ దర్శకత్వంలో రెండు సినిమాలకు సంతకం చేశానని, కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే ఆ ప్రాజెక్ట్స్ నుంచి తనని తొలగించారని చెప్పింది. అంతేకాదు ఆడ్స్ చేసుకుందామంటే.. అందులోనుంచి కూడా తనను తీసేశారంది.