సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది. దీనితో సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్, అఖిల్, సాయిధరమ్ తేజ్, సుశాంత్, కాజల్, రాశి ఖన్నా లాంటి సెలెబ్రిటీలు ఇప్పటికే సమంత వ్యాధిపై స్పందించారు.