స్టేజ్‌పై కూడా అల్లు శిరీష్‌ని మరోసారి ఆడుకున్నారు బాలకృష్ణ. శిరీష్, బాలయ్య మధ్య కన్వర్జేషన్ ఆద్యంతం నవ్వులు పూయించింది. అదే సమయంలో శిరీష్‌ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు బాలయ్య. ఈ సందర్భంగా బాలయ్య నటించిన `భైరవద్వీపం`, `ఆదిత్య 369` తనకు చాలా ఇష్టమని చెప్పారు శిరీష్. మరోవైపు తాను నటించిన చిత్రాల్లో ఊర్వశి, రాక్షసి ఎవరో చెప్పాలంటూ నయనతార, విజయశాంతి, సిమ్రాన్, శృతి హాసన్ పేర్లు శిరీష్ చెప్పగా, నయనతార ఊర్వశి అని,శృతి హాసన్ రాక్షసి అని బాలయ్య చెప్పడం విశేషం.