harikrishna
Harikrishna : హరికృష్ణ నందమూరి ఫ్యామిలీలో, రామారావు సంతానంలో డేర్ అండ్ డాషింగ్. తాను చిన్నప్పుడు చాలా అల్లరి పనులు కూడా చేసేవాడట. ఎన్టీఆర్ పిల్లల్లో అందరు సైలెంట్‌గా ఉండేవారని, కానీ హరికృష్ణ మాత్రం గోల గోలగా ఉండేవాడట.
అందరిని ఆటపట్టించేవారట. అయితే హరికృష్ణ కారణంగా ఓ హీరో చిన్నప్పుడు దెబ్బలు తినాల్సి వచ్చింది. హరికృష్ణ ని కొట్టలేక తనని కొట్టేవాడట ఆ హీరో నాన్న. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ ఇంట్లోనే పుట్టి పెరిగాడు. మరి హీరో ఎవరు? ఆ కథేంటో చూస్తే.
rajendra prasad
ఎన్టీఆర్ ఇంట్లోనే పుట్టిన పెరిగిన హీరో ఎవరో కాదు కామెడీ చిత్రాలస్టార్ హీరో రాజేంద్రప్రసాద్. ఒకప్పుడు ఆయన వరుసగా కామెడీ సినిమాలు చేసి స్టార్ హీరోగా రాణించారు. అడపాదడపా ఇతర హీరోల సినిమాల్లోనూ కీలక రోల్స్ చేసి మెప్పించిన
ఆయన సొంతంగా చాలా వరకు కామెడీ చిత్రాలు, సెంటిమెంటల్ మూవీస్ చేసి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని బాగా అలరించారు. అలాంటి రాజేంద్రప్రసాద్ చిన్నప్పుడు ఎన్టీఆర్ ఇంట్లోనే పెరిగారట. చాలా సార్లు ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
NTR
ఎన్టీఆర్ ఇంట్లోనే పెరగడంతో ఆయన పిల్లలతోనూ మంచి అనుబంధం ఉండేది. అంతేకాదు రామారావు కొడుకుల్లో ఈయన కూడా ఓ భాగమైపోయాడు. అయితే చిన్నప్పుడు హరికృష్ణ చేసే అల్లరి పనుల వద్ద తాను దెబ్బలు తినాల్సి వచ్చిందట. రాజేంద్రప్రసాద్ ఈ విషయాన్ని చెప్పారు. `
నేను ఎన్టీరామారావు ఇంట్లో పుట్టాను. ఆ ఇంట్లోనే సుమారు 24ఏళ్లు అద్దెకి ఉన్నాం. మా నాన్న ఎంత స్టిక్ట్ అంటే, హరికృష్ణ అల్లరి చేస్తే ఆయన్ని కొట్టలేక నన్ను కొట్టేవాడు అని తెలిపారు రాజేంద్రప్రసాద్. ఇటీవల రాబిన్‌హుడ్ ఈవెంట్‌లో ఈ విషయం బయటపెట్టాడు.
rajendraprasad
రాజేంద్రప్రసాద్ సినిమాల్లోకి రావడానికి, ఆయన హీరో కావడానికి కూడా ఓ రకంగా ఎన్టీఆరే ఆదర్శంగా చెప్పొచ్చు. ఆయన హీరోగా రాణిస్తున్న నేపథ్యంలో తాను కూడా హీరో కావాలని మద్రాస్‌కి వెళ్లిపోయారు. అక్కడ యాక్టింగ్ స్కూల్‌లో చేరారు. ఎక్కువ రోజులు యాక్టింగ్ స్కూల్‌లో ఉన్నారు
. మైమ్ అండ్ మూమెంట్ అనే స్పెషల్ విభాగంలో రాజేంద్రప్రసాద్ ఎక్స్ పర్ట్. గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆ విభాగంలో తన జూనియర్స్ కి క్లాస్‌లు కూడా తీసుకున్నారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
read more: వెంకటేష్ సినిమా కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ మూవీ నుంచి కాపీ కొట్టిన త్రివిక్రమ్ ? ఇంతకీ ఏంటా చిత్రం..
also read: