తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా అనేక భారతీయ భాషలలో 30,000 పైగా పాటలు పాడిన గాయని పి.సుశీల. 1953లో ఎం.ఎస్.విశ్వనాథన్ , సుబ్బురామన్ సంగీతంలో విడుదలైన "చంద్రాణి" చిత్రం ద్వారా ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు.
ఇక ఇతర భాషలతో పోలిస్తే, సుశీల తెలుగు, కన్నడ భాషల్లో ఎక్కువ పాటలు పాడారు. ఆరు తరాల నటులతో, దాదాపు 70 సంవత్సరాలుగా ఆమె ఈ కళా ప్రపంచంలో అత్యుత్తమ గాయనిగా కొనసాగుతున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో సహా అనేక రికార్డులను సాధించిన పి.సుశీల వయస్సు ప్రస్తుతం 89.