బిగ్ ట్విస్ట్: శృతి హాసన్, అనుపమ, నజ్రియా ఇంతమంది ధనుష్ పై పగపట్టారేంటి..నయనతారకి సపోర్ట్

First Published | Nov 16, 2024, 4:51 PM IST

ధనుష్, నయనతార మధ్య వివాదం సంచలనంగా మారింది. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతున్నట్లు తాజాగా నయనతార రిలీజ్ చేసిన బహిరంగ లేఖ ద్వారా అర్థం అవుతోంది. 

ధనుష్, నయనతార మధ్య వివాదం సంచలనంగా మారింది. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతున్నట్లు తాజాగా నయనతార రిలీజ్ చేసిన బహిరంగ లేఖ ద్వారా అర్థం అవుతోంది. కేవలం 3 సెకండ్ల వీడియో వాడుకున్నందుకు ధనుష్ నయనతారపై 10 కోట్ల కాపీ రైట్ కేసు వేశారు. 

నానుమ్ రౌడీ దాన్ చిత్రం నుంచి ధనుష్, నయన్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ సినిమా టైంలో వీరిద్దరి మధ్య ఏదో బలమైన సంఘటన జరిగినట్లు ఉంది అని నెటిజన్లు అనుమానపడుతున్నారు. నయనతార జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ చిత్రం నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేశారు. 


ఇందులో 3 సెకండ్ల వీడియో క్లిప్ ని నానుమ్ రౌడీ దాన్ చిత్రం నుంచి తీసుకున్నారు. విజయ్ సేతుపతి, నయనతార నటించిన ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. తన అనుమతి లేకుండా ఇలా చేశారని ధనుష్ కేసు వేశారు. కేవలం 3 సెకండ్ల వీడియోకి ధనుష్ ఏకంగా 10 కోట్ల కేసు వేశాడంటే.. ఆ చిత్ర సమయంలో నయన్, ధనుష్ మధ్య ఏదో పెద్ద వ్యవహారమే జరిగి ఉండాలి. 

దీనిని తప్పుబడుతూ నయన్ బహిరంగ లేఖలో ధనుష్ పై దుమ్మెత్తి పోసింది. ఊహించని విధంగా ఇతర స్టార్ హీరోయిన్లు కూడా నయనతారకి మద్దతు తెలుపుతున్నారు. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ పార్వతి తిరువొతు, నజ్రియా లాంటి హీరోయిన్లు లైకులు రూపంలో, కామెంట్స్ రూపంలో నయనతారకి మద్దతు తెలుపుతున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్లంతా ధనుష్ తో నటించిన వాళ్లే. 

అంటే ధనుష్ బిహేవియర్ పట్ల వీళ్లంతా కోపంతో ఉన్నారా ? నయనతార ఓపెన్ అయింది కాబట్టి ఆమెకి సపోర్ట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శృతి హాసన్ ధనుష్ తో 3 అనే చిత్రంలో నటించింది. అనుపమ పరమేశ్వరన్ కోడి చిత్రంలో, పార్వతి తిరువొతు మార్యన్ చిత్రంలో నటించింది. 

Latest Videos

click me!