RRR Glimpse: ఈ డీటెయిల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్

First Published | Nov 1, 2021, 2:36 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా RRR చిత్ర అసలైన హంగామా మొదలయింది. కొద్దిసేపటి క్రితమే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 45 సెకండ్ల గ్లింప్స్ విడుదలైంది.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా RRR చిత్ర అసలైన హంగామా మొదలయింది. కొద్దిసేపటి క్రితమే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 45 సెకండ్ల గ్లింప్స్ విడుదలైంది. రేసీగా, అద్భుతమైన విజువల్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ షాట్స్ తో గ్లింప్స్ మొత్తం నిండిపోయింది. 

RRR Glimpse లో కథకు సంబంధించిన వివరాలు లేకుండా, ఎలాంటి డైలాగ్ లేకుండా జక్కన్న జాగ్రత్త పడ్డారు. అయితే స్లో మోషన్ లో గమనిస్తే కొన్ని క్లూస్ లభిస్తాయి. అక్కడక్కడా జక్కన్న వదిలిపెట్టిన డీటెయిల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉన్నాయి. 


ఆదీవాసీలని గుర్తు చేసేలా బ్యాగ్రౌండ్ సంగీతంతో గ్లింప్స్ మొదలవుతుంది. గ్లింప్స్ మొత్తం కీరవాణి బ్యాగ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంది. ఆ తర్వాత లక్షల జనం ఉన్న విజువల్స్ కనిపిస్తాయి. కంచెని చీల్చుకుని పోలీస్ స్టేషన్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆతర్వాత టాప్ యాంగిల్ లో పులి వెంట పడుతుండగా ఎన్టీఆర్ పరిగెత్తే విజువల్ అద్భుతమా ఉంటుంది. పులికే చిక్కడం లేదంటే.. ఇక కొమరం భీం బ్రిటిష్ వారికి దొరికే ప్రసక్తే లేదు. 

ఇక Ajay Devgn తన గ్యాంగ్ తో బ్రిటిష్ పోలీసులపై కాల్పులు జరుపుతూ ఉంటాడు. అజయ్ దేవగన్ రోల్ ఏంటనేది ఇప్పటికైతే సస్పెన్సే. ఆ తర్వాత Ram Charan వివిధ గెటప్పులో కనిపిస్తాడు. ఇక గ్లింప్స్ లో ఓ భారీ బ్రిడ్జ్ ఆసక్తి రేపుతోంది. అది రెండు లేయర్స్ ఉండే బ్రిడ్జ్. కింది లేయర్ లో రైల్వే ట్రాక్ పైన వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్లతో వెళుతున్న ట్రైన్ పేలిపోతున్నట్లు కనిపిస్తుంది. 

కొన్ని సెకండ్ల తర్వాత పై భాగాన్ని చూపిస్తారు. చాలా లాంగ్ షాట్స్ లో ఉన్న ఆ విజువల్స్ గమనిస్తే బ్రిడ్జిపైన మందుపాతరలు ఉంటాయి. బ్రిడ్జి ఒకవైపు నుంచి రాంచరణ్ జాతీయ జెండా పట్టుకుని, మరో వైపున NTR నీటిలో దుకేస్తూ కనిపిస్తారు. దీనిని బట్టే సులభంగా ఊహించవచ్చు.. ఆయిల్ ట్యాంకర్లతో కూడిన ట్రైన్ ని పేల్చేయడడం ద్వారా రామ్ - భీం ఇద్దరూ ఆ భారీ బ్రిడ్జిని కూల్చేసి సన్నివేశం అది అని. ఈ సన్నివేశానికి థియేటర్స్ లో గూస్ బంప్స్ గ్యారెంటీ అని అర్థం అవుతోంది. 

ఇక టీజర్ చివర్లో భీకరమైన యాక్షన్ సన్నివేశంలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కనువిందు చేశారు. ముందు నుంచి రాంచరణ్ ని నిప్పుతో.. ఎన్టీఆర్ ని నీటితో పోల్చుతూ రాజమౌళి విజువల్స్ వదులుతున్నారు. గ్లింప్స్ లో కూడా చరణ్ మంటల్లో కాలుతూ ఉండే కొరివిని.. ఎన్టీఆర్ ఓ వాటర్ పైప్ ని పట్టుకుని ఉగ్ర రూపంతో కనిపిస్తారు. చివర్లో పోలీస్ పై ఓ పులి దూకుతూ కనిపిస్తుంది. విజువల్స్ మొత్తం గ్రాండ్ గా ఉన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి మరోసారి బాక్సాఫీస్ మ్యాజిక్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. Also Read:RRR first glimpse: ఫెరోషియస్, ఫియర్ లెస్ భీమ్-రామ్- గూస్ బంప్స్ గ్యారంటీ!

Latest Videos

click me!