అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2' ఈరోజు థియేటర్ లలో ప్రేక్షకుల ముందు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం బెనిఫిట్ షోలతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. అక్కడదాకా అంతే బాగుంది.
అయితే సినిమాలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి డైలాగులు పెట్టారని వార్తలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్న నేపధ్యంలో అసలు నిజం ఏమిటనేది చూసిన వారికి తప్పించి అర్దం కావటం లేదు. లేని వాళ్లు కొన్ని ఫేక్ పోస్ట్ లు అవి ఫేక్ అని తెలియకుండానే స్ప్రెడ్ చేసేస్తున్నారు. అసలు ఏం జరిగింది. ఏం డైలాగులు పెట్టారు అనేది చూద్దాం.
గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మూవీలోని కొన్ని డైలాగులుని తమకు అనుకూలంగా మార్చుకుని కొందరు ఈ మంటల రచ్చకి పెట్రోల్ పోసి మరింత ఆజ్యం పోస్తున్నారు .
ఆ పోస్ట్ లలో ఏముంది అంటే..ఈ సినిమాలో "ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికీ, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్" అనే డైలాగ్ ఉన్నట్లుగా వైరల్ గా మారింది. ఈ డైలాగ్ తో డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను టార్గెట్ చేశాడా అని అంటున్నారు. అయితే ఈ డైలాగు నిజం కాదు. ఫేక్ డైలాగు ఇది. మరి అసలు నిజంగా సినిమాలో ఉన్నదేమిటి..
Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI
పుష్ప 2 సినిమాలో హీరో ఇంట్రడక్షన్ టైమ్ లో ..జపాన్ లో ఉన్న హీరో ...విలన్ తో.. “ఎవడ్రా బాస్? ఎవడికిరా బాస్? మాములుగా చూస్తేనే బాస్ కనిపిస్తాడు. ఇలా తల్లకిందులుగా చూస్తేనే బాస్ లకే బాస్ కనిపిస్తాడు. నేనేరా నీ బాస్. పుష్పాయే బాస్. భూగోళంలో యాడున్నా సరే… నీ యెవ్వా తగ్గేదేలే” అంటాడు. దాన్ని చిరంజీవిని చాలా మంది బాస్ అంటారు కాబట్టి దాన్ని అలా అన్వయించి పోస్ట్ లతో విష ప్రచారం చేస్తున్నారు కొందరు.
అలాగే పుష్ప2 ఇంట్రవెల్ టైమ్ లో ఓ డైలాగు వస్తుంది. “పుష్ప గాడు తగ్గితే సూడాలని సాలా మంది ఎదురు చూస్తా ఉండారు”అని. అది కథలో భాగంగా అక్కడ అవసరమైన డైలాగు. అయితే దీన్ని కూడా మెగా కాంపౌండ్ కు వర్తింప చేస్తూ వైరల్ చేస్తున్నారు. సినిమాలో పావలా వాటా డైలాగుని కూడా మరో విధంగా ప్రచారం చేస్తున్నారు.
‘పుష్ప ది రూల్’కి అన్ని చోట్ల నుంచీ ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది.
భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. బుధవారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు