Allu Arjun, #Pushpa2, Sukumar, #kALKI
పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని.. ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది.
అయితే అల్లు అర్జున్ పై వరుస పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన బక్క జడ్సన్.. జరిగిన దారుణానికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని కోరారు. మరో ప్రక్క ఈ ఇష్యూలోకి పీ.డీ.ఎస్.యూ. ఎంట్రీ ఇచ్చింది.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ.డీ.ఎస్.యూ) తాజాగా ఓ కీలక డిమాండ్ తెరపైకి తెచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం వల్ల రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు.. ఆమె కొడుకు చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.
ఇప్పటికే సినిమా టిక్కెట్ రేట్లను రూ.3 వేలకు వరకూ పెంచి.. పేద, మధ్య తరగతికి చెందిన సినిమా అభిమానుల జేబులు గుల్ల చేశారని అన్నారు. సినిమా వినోదాలను పంచేదిగా ఉండాలి కానీ.. విషాదాలను మిగిల్చే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. అర్ధరాత్రి సినిమా హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారంటూ ప్రశ్నించారు!
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర ఉద్రిక్తత నెలొకొంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ప్రీమియర్ షోకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ పై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు.
Allu Arjun, #Pushpa2, sukumar
రాత్రి నుంచి పుష్ప 2 బెనిఫిట్ షోలు మొదలవగా షో చూడడానికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాదులో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ కూడా సినిమా చూడడానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ అభిమాన హీరోని చూడాలనుకున్న అభిమానుల మధ్య పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
ఈ నేపథ్యంలోనే 39 సంవత్సరాల వయసున్న రేవతి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించింది. ఆమె కొడుకు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.
Allu Arjun, #Pushpa2, sukumar
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే యువతి మరణించింది. దీనికి అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ ఆ రాత్రి పూట రావాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు ఆయనను అరెస్టు చేయడంతో పాటు మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కూడా కోరారు.