విజయ్ దేవరకొండతో పెళ్లి వద్దని చెప్పా, రష్మిక గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది.. బాంబు పేల్చిన వేణు స్వామి

Published : Dec 28, 2023, 01:27 PM IST

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది.

PREV
16
విజయ్ దేవరకొండతో పెళ్లి వద్దని చెప్పా, రష్మిక గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది.. బాంబు పేల్చిన వేణు స్వామి

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. వేణు స్వామి చేసే వ్యాఖ్యలు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి. 

26
Venu swamy

కొన్నిసార్లు వేణు స్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం వివాదంగా మారడం చూస్తూనే ఉన్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరీర్ ఉండదని గతంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే సలార్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ట్రోల్ చేశారు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే మూడు డిజాస్టర్ అయ్యాయి అని కేవలం 1 మాత్రమే హిట్ అని వేణు స్వామి తనని తాను సమర్థించుకున్నారు. 

36
Rashmika mandanna

తాజాగా వేణు స్వామి మరో బాంబు పేల్చారు. రీసెంట్ గా వేణు స్వామి.. రష్మిక మందన, విజయ్ దేవరకొండ లవ్ ఎఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విజయ్, రష్మిక రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా.. వేణు స్వామి అది అందరికి తెలిసిందే కదా అని అన్నారు. రష్మిక, విజయ్ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అన్నారు. కానీ విడిపోతారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

46

డైరెక్ట్ గా నేను ఈ విషయాన్ని రష్మికకే చెప్పాను. విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోకు అని చెప్పా. ఆ విషయంలో నాకు రష్మికకి గొడవలు జరిగాయి. విభేదాలు వచ్చాయి. అప్పటికి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో వెళ్ళిపోయింది. నన్ను పక్కన పెట్టేసింది. నాకేం ఇబ్బంది లేదు. 

56

రష్మిక గతంలో వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు కూడా బయటకి వచ్చాయి. తన జాతకం ప్రకారం వేణు స్వామి చెప్పినట్లు రష్మిక నడుచుకునేదు. విజయ్ దేవరకొండ విషయంలో గొడవతో ఆయనని పక్కన పెట్టేసింది. ఈ విషయాని వేణు స్వామి ఓపెన్ గా చెప్పేశారు. 

66

గతంలో వేణు స్వామి స్టార్ కపుల్స్ చాలా మంది విడిపోతారు అంటూ కామెంట్స్ చేశారు. సమంత, నాగ చైతన్య విషయంలో తాను చెప్పినట్లే జరిగింది అని కూడా వేణు స్వామి గతంలో అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories