ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం రవితేజ కష్టానికి మంచి రిజల్ట్ అనుకోవచ్చు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.