
సూపర్ స్టార్ Mahesh నుంచి వరుస హిట్ల తర్వాత వస్తోన్న చిత్రం `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata). `గీతగోవిందం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. `మహానటి` కీర్తిసురేష్ కథానాయికగా నటించిన బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా `సర్కారు వారి పాట`. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. మహేష్ చాలా గ్యాప్ తర్వాత బాడీ లాంగ్వేజ్ పరంగా మరింత ఓపెన్ అయి చేసిన చిత్రమిది. కీర్తిసురేష్(Keerthy Suresh) నటిగా మరింత ఓపెన్ అయ్యింది. చాలా హాట్‌గానూ కనిపిస్తుంది. అంతేకాదు మాస్, క్లాస్ మేళవింపుగా ఉంది. మహేష్ సరికొత్త మేకోవర్‌తో, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో రూపొందిన `సర్కారు వారి పాట` గురువారం(మే 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ముందుగా ఓవర్సీస్(అమెరికా)లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. మరి సినిమాకి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వినిపిస్తుందనేది `ట్విట్టర్ టాక్`లో(Sarkaru Vaari Paata twitter Review) తెలుసుకుందాం.
`సర్కారు వారి పాట` ఫంక్తు కమర్షియల్ సినిమాగా అర్థమవుతుంది. కాకపోతే మహేష్ కొత్తగా ట్రై చేసిన బాడీ లాంగ్వేజ్, కథనం, డైలాగులు సరికొత్తగా ఉండబోతుందనే సంకేతాలనిస్తుంది. సినిమా ప్రధానంగా యూఎస్ లో ఉండే హీరో ఇండియాకి వచ్చి ఇక్కడ బ్యాంక్ వ్యవస్థలోని లోటుపాట్లని ఎలా ఎదుర్కొన్నారు. ఇక్కడి విలన్లని ఎలా ఆటకట్టించాడనే కథాంశంతో సాగబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మహేష్ `మహి ఫైనాన్స్ కార్పొరేషన్` బ్యాంక్‌ని నడిపిస్తుంటాడు. వైజాగ్‌లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు బ్యాంక్ నుంచి వందల కోట్ల లోన్ తీసుకుని ఎగొడతాడు. అదే అమాయక ప్రజలను బ్యాంక్ వాళ్లు లోన్ల పేరుతో హింసిస్తుంటారు. ఈ క్రమంలో మహేష్ ఈ విషయంలో ఎలా ఇన్‌వాల్వ్ అయ్యాడు, ఎలా సెట్ చేశాడనేది ప్రధానంగా స్టోరీ లైన్ అని తెలుస్తుంది.
సినిమాకి ట్విట్టర్ టాక్‌లో చాలా వరకు పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. మహేష్ ఇంట్రడక్షన్ అదిరిపోయేలా ఉందని, యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమాప్రారంభమవుతుందంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ అందుతుంది. సినిమా ఫస్ట్ ఆఫ్ యావరేజ్‌గా ఉంటుందట. మంచి కంటెంట్ ఉన్న చిత్రమని చెబుతున్నారు. సెకండాఫ్ ఫైరింగ్ అంటున్నారు. మహేష్ వన్ మ్యాన్ షో అని అంటున్నారు. ఆయన నటన సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందట. కీర్తిసురేష్ అందాలు తోడవుతాయని, హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ట్రాక్ హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. మహేష్ కెరీర్‌లోనే ఒక బెస్ట్ ఫిల్మ్ గా, ఈ దశాబ్దంలోనే ఉత్తమ చిత్రంగా `సర్కారు వారి పాట` నిలిచిపోతుందంటున్నారు.
దర్శకుడు పరశురామ్ బాగా హ్యాండిల్ చేశారని, తమన్ బీజీఎం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందంటున్నారు. డీసెంట్ ఎంటర్‌టైనర్ అని, మహేష్ ఫ్యాన్స్ కిది మాస్ ఫీస్ట్ అని, ఆయన నటుడిగా మరింత ఎదిగారని, కీర్తిసురేష్ చాలా అందంగా ఉండటమే కాదు, ఆమె నటన కూడా చాలా బాగుందట. మరోవైపు మహేష్-వెన్నెల కిషోర్ మధ్యలో వచ్చే సన్నివేశాలు కామెడీని పంచుతాయని, అన్‌లిమిటెడ్ ఫన్ అంటున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ అదుర్స్ అట. డాన్సుల్లో మాత్రం ఇరగదీశాడని ట్విట్టర్ టాక్ ద్వారా తెలుస్తుంది. సినిమాకి రేటింగ్ బాగానే పడుతుంది. 3.5 నుంచి 4 రేటింగ్ ఇస్తుండటం విశేషం. సినిమా బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు.
ఇదిలా ఉంటే కాస్త నెగటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. సినిమా కథ రొటీన్‌గా ఉందని, ఫస్టాఫ్ అంతగా ఆకట్టుకోలేదని, సెకండాఫ్ బెటర్ అంటున్నారు. ముఖ్యంగా పరశురామ్ పాత కథతోనే వచ్చాడని అంటున్నారు. రొటీన్, బోరింగ్ సబ్జెక్ట్ అంటున్నారు. ఫ్యాన్స్ కి ఓకేగానీ, న్యూట్రల్ ఆడియెన్స్ కి ఇదొకి రొటీన్ మూవీలాగే అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహేష్‌బాబు, డైలాగ్‌లు, సాంగ్స్, బీజీఎం, నిర్మాణ విలువలు మాత్రమే సినిమాని కాపాడగలవంటున్నారు. సినిమాలో ల్యాగ్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తుంది. సినిమాకి మహేష్ ఒక్కడే ప్లస్ అంటున్నారు. యావరేజ్ ఫిల్మ్ రేటింగ్ ఇస్తున్నారు.
కొంత నెగటివ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, మేజర్‌గా `సర్కారు వారి పాట` చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుంది. యూఎస్‌లో, ఓవర్సీస్‌లో సినిమా చూసిన ఆడియెన్స్ చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఓవర్సీస్ ఆడియెన్స్ కి నచ్చింది ఇక్కడి ఆడియెన్స్ కి నచ్చాలని లేదు. పైగా ఇలాంటి ప్రీమియర్స్ షోస్ అభిమానులే ఎక్కువగా చూస్తుంటారు. కాబట్టి పాజిటివ్ రిపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు ఏకంగా `డిజాస్టర్‌ఎస్వీపీ` అంటూ ఓ యాష్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. దీంతో కొంత భయాందోళనలు గురి చేస్తుంది.
మరి నిజంగానే సినిమా ఎలా ఉంది. మహేష్ మ్యాజిక్ చేశాడా? ట్రైలర్‌లో అదరగొట్టినట్టు సినిమాలో ఉందా? దర్శకుడు పరశురామ్ మరో బ్లాక్‌బస్టర్ సినిమా చేశాడా? కీర్తిసురేష్ మెప్పించిందా? లేక డిజప్పాయింట్ చేశారా? అనేది, అసలైన `సర్కారు వారి పాట` మూవీ రివ్యూని `ఏషియానెట్ రివ్యూ`లో తెలుసుకుందాం.