`సలార్‌`పై వేణు స్వామి జోస్యం వైరల్‌.. ట్రైలర్‌ చూశాక ఆయన చెప్పిందే నిజం కాబోతుందా? అభిమానుల్లో కలవరం

Published : Dec 05, 2023, 07:01 PM ISTUpdated : Dec 05, 2023, 07:05 PM IST

ప్రభాస్‌ నటించిన `సలార్` ట్రైలర్‌ ఇటీవల విడుదల అయ్యింది. దీనిపై సర్వత్రా నిరాశ ఎదురయ్యింది. అయితే తాజాగా ప్రముఖ సెలబ్రిటీ జోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.   

PREV
15
`సలార్‌`పై వేణు స్వామి జోస్యం వైరల్‌.. ట్రైలర్‌ చూశాక ఆయన చెప్పిందే నిజం కాబోతుందా? అభిమానుల్లో కలవరం

ప్రభాస్‌ `బాహుబలి` తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో అందరి ఆశలు, అంచనాలు `సలార్‌`పైనే ఉన్నాయి. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. ఇందులో ప్రభాస్‌ కనిపించిన తీరు, ఆయన డైలాగులు చూశాక నీరసం వచ్చేసింది. ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్‌లో ఉన్నారు. ప్రభాస్‌ ఏంటి ఇలా కనిపించడమనే డైలామాలో పడ్డారు. 
 

25

`సలార్‌`పై నెగటివ్‌ టాక్‌ ప్రారంభమైంది. ఇలానే ఉంటే సినిమా డౌటే అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇది అటు యూనిట్‌తోపాటు అభిమానుల్లోనూ కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. గతంలో వేణు స్వామి చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

35

వేణు స్వామి గతంలో కొందరు సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. నాగచైతన్య, సమంతల విడాకులతో ఆయనపై అందరినిలోనూ కాస్త నమ్మకం ఏర్పడింది. ఇలా చాలా మంది విషయంలో ఆయన చెప్పిన విషయాలుజరుగుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారనే విషయం కూడా ఇప్పుడు నిజం అవుతున్న నేపథ్యంలో `సలార్‌`పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. దుమారం రేపుతన్నాయి. 

45
Prabhas

`ఆదిపురుష్‌` సమయంలోనే వేణు స్వామి ఈ సినిమా హిట్‌ కాదు అన్నారు. అదేజరిగింది. `సలార్‌` కూడా సక్సెస్‌ కావడం కష్టమని, ప్రభాస్‌కి మరో పరాజయం తప్పదని ఆయన చెప్పినట్టుగా కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భారీ ఆశలతో వెళితే నిరాశ తప్పదని, సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించదని ఆయన వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ కావడం గమనార్హం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

55

ఇక ప్రభాస్‌ హీరోగా రూపొందిన `సలార్‌` చిత్రంలో పృథ్వీరాజ్‌ విలన్‌ పాత్రలో నటించారు. ఫ్రెండ్‌ షిప్‌ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. ప్రాణమిచ్చే స్నేహితులు ఎందుకు విడిపోయారు, ఎందుకు బద్ద శత్రువులుగా మారారనేది కథ. ఈ నెల 22న సినిమా విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ నిరాశ పరిచిన నేపథ్యంలో మరో ట్రైలర్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారనట.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories