ఐశ్వర్య రాయ్ - అభిషేక్ బచ్చన్ డివోర్స్? విడిగా ఉండేందుకు సిద్ధమవుతున్నారా? వైరల్ అవుతున్న ఫొటో

First Published | Dec 5, 2023, 6:26 PM IST

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్య రాయ్ విడిపోతున్నట్టు మళ్లీ రూమర్లు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు తాజాగా అభిశేక్ ఫొటోను వైరల్ చేస్తూ త్వరలో విడిపోతున్నారంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఇంతకీ రూమర్ల వెనక కారణాలు ఏంటనేది చూద్దాం.

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)   గురించి షాకింగ్  న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో ఆమె డివోర్స్ తీసుకోబోతోందా? అనే సందేహాలు రేకెత్తించేలా కొన్ని వార్తలు వస్తున్నాయి. 

కొన్నాళ్లుగా అప్పుడప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్టు రూమర్లు పుట్టుకొచ్చాయి. వాటిపై ఎప్పుడూ వీరిద్దరూ స్పందించలేదు. ఇక తాజాగా మళ్లీ అవే రూమర్లు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి. 
 


బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు కూడా ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)తో సంతోషంగా లేదంటూ ట్వీట్ చేశారు. దీనికి తోడు ఇటీవల ఓ మీడియా ఈవెంట్ లో కనిపించిన అభిషేక్ బచ్చన్ చేతికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడం గమనార్హంగా మారింది.

మరోవైపు అభిషేక్ ఐశ్వర్యను ఇన్ స్టాలో అన్ ఫాలో చేశారంటూ కూడా రూమర్లు పుట్టుకొస్తున్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పార్థాలు ఉన్నాయని.. సెపరేట్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు క్రిటిక్ ఉమైర్ సంధు చెప్పుకొస్తున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

కానీ అభిషేక్ బచ్చన్ తాజా ఫొటోను మాత్రం వైరల్ చేస్తూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది అవాస్తవమని తెల్చుతున్నారు. ఇందుకు అభిషేక్ ఏమాత్రం ఒప్పుకోడని, అది జరిగే పని కాదంటూ స్పందిస్తున్నారు. మరికొందరు కొంతకాలంగా ఐశ్వర్య తన పాపతోనే ఉంటుందంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే.. వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. 

ఇక ఐశ్వర్య రాయ్ ‘ధూమ్2’ సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ కు దగ్గరైంది. ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న నిశ్చితార్ధం జరిగింది. 20 ఏప్రిల్ 2007న ముంబైలో గ్రాండ్ గా జరిగింది.  కొన్నేళ్ల తర్వాత 2011 నవంబర్ 16న వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. 

Latest Videos

click me!