వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు.. అబద్దాలు చెప్పి పరువు పోయినా వెంటపడుతున్నారుగా..

Published : Jun 13, 2024, 04:23 PM ISTUpdated : Jun 13, 2024, 05:11 PM IST

ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలతో వేణు స్వామి పరువు పోయింది. అయినప్పటికీ హీరోయినాల్లో వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.

PREV
17
వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు.. అబద్దాలు చెప్పి పరువు పోయినా వెంటపడుతున్నారుగా..

వివాదాలు వెంటాడుతున్నా తన జాతకం తప్పదని.. చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని వేణు స్వామి వాదిస్తుంటారు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్ పై వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. ఒక వేళ ఆయన చెప్పింది జరగకపోయినా దానిని కవర్ చేసుకునే నైపుణ్యం కూడా వేణు స్వామి దగ్గర ఉంది. 

27

ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, సమంత, నయనతార ఇలా బడా సెలెబ్రిటీల జాతకాల గురించి వేణు స్వామి చేసే వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల రాజకీయాల విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం బెడిసికొట్టింది. 

37

ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని వేణు స్వామి ఢంకా భజాయించి చెప్పారు. కట్ చేస్తే కూటమి ఘనవిజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. వైసీపీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ పార్టీ 11 సీట్లకే పరిమితం అయింది. తెలంగాణలో కూడా వేణు స్వామి చెప్పింది జరగలేదు. కానీ వేణు స్వామి జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పవన్ కలవడం కష్టం అని.. కలిస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయని గతంలోనే చెప్పినట్లు వేణు స్వామి తెలిపారు. 

47

ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలతో వేణు స్వామి పరువు పోయింది. అయినప్పటికీ హీరోయినాల్లో వేణు స్వామి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయతి లాంటి హీరోయిన్లంతా తమకి కెరీర్ లో మంచి జరగాలని వేణు స్వామీ దగ్గర పూజలు చేశారు. వేణు స్వామి దగ్గరుండి హీరోయిన్ల దగ్గర పూజలు, దోష పరిహారాలు చేయించిన సంగతి తెలిసిందే. 

57

ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కూడా హీరోయిన్లు వేణు స్వామి వెంటపడుతున్నారు. ఆయన చెప్పిన జాతకం తప్పుతున్నప్పటికీ హీరోయిన్లు మాత్రం వదిలిపెట్టడం లేదు. తాజాగా కన్నడ హీరోయిన్ నిశ్విక వెనుస్వామి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నారు. 

67

ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి చెప్పేది అంతా అబద్దం అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కానీ హీరోయిన్లలో ఆయన క్రేజ్ మాత్రం రాష్ట్రాలు దాటుతోంది. రాను రాను వేణు స్వామి పాన్ ఇండియా జ్యోతిష్యుడిగా మారిపోతారేమో అంటూ నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. 

77

నిశ్విక 2018లో హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 28 ఏళ్ళ నిశ్విక కన్నడలో వరుస చిత్రాలు చేస్తూ క్రేజ్ సొంతం చేసుకుంది. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి క్రేజీ హీరోయిన్లు వేణు స్వామిని నమ్మడంతో నిశ్విక లాంటి వారు కూడా ఆయన కోసం వస్తున్నారు. 

click me!

Recommended Stories