ఎస్ఎస్ఎంబీ 29 పీరియాడిక్ మూవీనా? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్ లీక్ చేసిన రాజమౌళి తండ్రి!

First Published Jun 13, 2024, 3:22 PM IST

మహేష్ బాబు- రాజమౌళి కెరీర్లో ఫస్ట్ టైం సినిమా వాస్తుంది. అది కూడా  పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. 
 

Mahesh Babu and Rajamouli

ఎస్ఎస్ఎంబీ 29 దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడం ఒక విశేషం. అలాగే మహేష్ తో ఆయన చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. మరొక విశేషం ఏమిటంటే రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ. అంతర్జాతీయ ప్రమాణాలతో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్నాడు. 

Mahesh Babu and Rajamouli

ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు. అది వెయ్యి కోట్ల వరకు కూడా చేరవచ్చని సమాచారం.స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని సమాచారం. 
 

Mahesh Babu and Rajamouli

 మహేష్-రాజమౌళి చేసే మూవీ ఎలా ఉండబోతుందో ఇప్పటికే తెలియజేశారు. దర్శకుడు రాజమౌళితో పాటు కథ సమకూర్చిన విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో కొన్ని హింట్స్ ఇచ్చారు. మహేష్ ఇమేజ్ కి తగ్గట్లు ఓ యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. 

Mahesh Babu and Rajamouli

ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహా లో ఉంటుందని రాజమౌళి ఓ సందర్భంలో అన్నారు. ఇక మహేష్ పాత్ర సాహసోపేతంగా ఉంటుంది. ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా మహేష్ కనిపిస్తాడని తెలియజేశారు. 

Mahesh Babu and Rajamouli

ఆర్ ఆర్ ఆర్ తరహాలో ఎస్ఎస్ఎంబీ 28 సైతం పీరియాడిక్ డ్రామా అంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఎస్ఎస్ఎంబీ 29 పీరియాడిక్ స్టోరీ కాదని, సమకాలీన కథ అని ఆయన వెల్లడించారు. 

Mahesh Babu and Rajamouli

కాబట్టి ఎస్ఎస్ఎంబీ 29 కాంటెంపరరీ జంగిల్ అడ్వెంచర్ అండ్ యాక్షన్ డ్రామా అని పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం కోసం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నాడు. ఆయన జుట్టు, గడ్డం పెంచుతున్నారు. రాజమౌళి తన హీరోలను చొక్కాలు లేకుండా కండలతో చూపించేందుకు ఇష్టపడతాడు. మహేష్ ని కూడా ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. 
 

Latest Videos

click me!