చంద్రబాబు ప్రమాణస్వీకారం..ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం వాళ్ళిద్దరేనా, అందుకే డైరెక్ట్ గా హైదరాబాద్ లో..?

First Published Jun 13, 2024, 3:13 PM IST

ఒక వైపు మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్ గురించి చర్చ జరుగుతుంటే.. నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. దీనితో మరోసారి నందమూరి వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో అభిమానులు చెలరేగిపోతున్నారు.

ఒక వైపు మెగా ఫ్యామిలిలో అల్లు అర్జున్ గురించి చర్చ జరుగుతుంటే.. నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గురించి చర్చించుకుంటున్నారు. దీనితో మరోసారి నందమూరి వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో అభిమానులు చెలరేగిపోతున్నారు. బుధవారం రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీనితో మెగా నందమూరి ఫ్యామిలీలు చాలా సందడిగా కనిపించాయి. అభిమానులు పండగ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి రాంచరణ్ సహా అందరూ వచ్చారు. అల్లు ఫ్యామిలీ ఎవరూ రాలేదు. నిఖిల్, నారా రోహిత్, నిర్మాత నాగవంశీ లాంటి వారిని కూడా ఆహ్వానించారు. 

కానీ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు. అయితే ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా లేదా అనే చర్చ జరుగుతోంది. కొందరు టిడిపి వైపు నుంచి ఎన్టీఆర్ కి ఆహ్వానం అందింది అని చెబుతున్నారు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ ని ఎవరూ ఆహ్వానించలేదని అంటున్నారు. నిఖిల్, సాయిధరమ్ తేజ్ లాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి ఎన్టీఆర్ ని ఆహ్వానించకుండా ఉంటారా ? ఎన్టీఆర్ కి తప్పకుండా ఇన్విటేషన్ అందే ఉంటుంది అనేది మరో వాదన. 

అయితే ఇక్కడ నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి ఉన్న గ్యాప్ గురించి మరోసారి చర్చనీయంశంగా మారింది. చాలా కింది స్థాయి సెలెబ్రెటీలకు కూడా ఆహ్వానం అందింది. అలాంటప్పుడు ఎన్టీఆర్ కి కూడా ఇన్విటేషన్ పంపాలనే చర్చ జరిగే ఉంటుంది. కానీ నారా లోకేష్, బాలయ్య అడ్డు పడ్డారనే హాట్ రూమర్ వైరల్ అవుతోంది. 

ఈ మేరకు సోషల్ మీడియా, కొన్ని వెబ్ సైట్స్ లో పుకార్లు మొదలయ్యాయి. బాలయ్య, చంద్రబాబు, నారా లోకేష్ తో ఎన్టీఆర్ కి సంబంధాలు సరిగా లేవనేది అంతటా తెలిసిన నిజమే. ఎన్టీఆర్ ని టిడిపిలోకి ఆహ్వానించేందుకు సుముఖంగా లేరు. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. 

Balakrishna

ఆహ్వానం అందకపోవడం వల్లే తారక్ సరిగ్గా ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత గోవా నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చారు. ఒకవేళ ఇన్విటేషన్ అంది ఉంటే విజయవాడలో ల్యాండ్ అయి ఉండేవారని అంటున్నారు. ఎన్టీఆర్ కనుక హాజరై ఉంటే అదొక చారిత్రాత్మక దృశ్యం అయి ఉండేది. 

వేదికపైనే బాలయ్య చిరంజీవి సందడి చేశారు. వేదిక కింద విఐపి గ్యాలరీలో రాంచరణ్, ఎన్టీఆర్ కలసి కూర్చునేవారు. ఏది ఏమైనా తారక్ హాజరు కాకపోవడం పట్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉన్నాయి. 

Latest Videos

click me!