Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం

Published : Dec 10, 2025, 11:47 AM IST

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. మొదటిసారి సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో వెంకీ హౌజ్‌ నెంబర్‌ని త్రివిక్రమ్‌ బయటపెట్డడం విశేషం. 

PREV
14
వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా

విక్టరీ వెంకటేష్‌ ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టారు. అది ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో చాలా సెలక్టీవ్ గా వెళ్తోన్న వెంకటేష్‌ ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు)  నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ మధ్య ఓపెనింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించుకుంది. బుధవారం నుంచి షూటింగ్‌ స్టార్ట్ అయినట్టు టీమ్‌ అధికారికంగా వెల్లడించింది.

24
ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం 47

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రమిది. వెంకటేష్‌ సినిమాలకు త్రివిక్రమ్‌ రైటర్‌గా పనిచేశారు. కానీ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో వెంకీ సినిమా చేయలేదు. చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు కలిసి పనిచేయాలని భావించారు. ఓ సారి అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఆ తర్వాత ఆగిపోయింది. ఎట్టకేలకు ఇప్పుడు పట్టాలెక్కింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ని ప్రకటించారు. దీనికి `ఆదర్శకుటుంబం` అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఇందులో వెంకటేష్‌ ఉండే హౌజ్‌ నెంబర్‌ని కూడా ప్రకటించడం విశేషం. `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెం: 47`గా దీన్ని ఖరారు చేశారు. `ఆదర్శ కుటుంబ` మూవీలో వెంకటేష్‌ హౌజ్‌ నెం: 47 లో ఉంటాడని తెలుస్తోంది.

34
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో వెంకీ, త్రివిక్రమ్‌ మూవీ

వెంకటేష్‌ ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్‌. అదే సమయంలో త్రివిక్రమ్‌ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా డీల్ చేశారు. `అల వైకుంఠపురములో` చిత్రానికిది నిదర్శనం. ఇది ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ప్లాన్‌ని వర్కౌట్‌ చేస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. వెంకటేష్‌ మూవీకి కూడా మంచి ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే టైటిల్‌ పెట్టారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన ఈ కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది.

44
ఆదర్శ కుటుంబం మూవీ షూటింగ్‌ స్టార్ట్

`ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47` ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్‌లో క్లాస్ గా కనిపిస్తున్నారు. హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది. వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచి చిత్ర పరిశ్రమతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. పైగా త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు నెలకొన్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories