Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ

Published : Sep 28, 2026, 03:59 PM IST

వెంకటేష్‌ ప్రస్తుతం `ఆదర్శ కుటుంబం` మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఒకేసారి మూడు రెట్లు జంప్‌.

PREV
14
ఆదర్శ కుటుంబంతో రాబోతున్న వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. తన తదుపరి ప్రాజెక్టుల విషయంలోనూ ఆసక్తిని పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆదర్శ కుటుంబం’(హౌజ్‌ నెం 47)- `ఏకే 47` సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న చిత్రమిది. అక్టోబర్‌ 9న ఈ చిత్రం విడుదల కానుంది.

24
ఏకే 47 పై భారీ అంచనాలు

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్‌. తాజాగా `నారాయణమ్మ` అనే పాటని విడుదల చేశారు. ఇందులో వెంకటేష్‌, డింపుల్‌ హయతి, నివేతా పేతురాజు స్టెప్పులేశారు. మాస్‌ ఆడియెన్స్ ని ఊపేసేలా ఈ పాట ఉంది. ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. వరుసగా వెంకటేష్‌ ఫ్యామిలీ చిత్రాలతో విజయాలు అందుకుంటున్నారు. దీనికితోడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకీ నటిస్తోన్న మొదటి సినిమా కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి.

34
ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ పారితోషికం

ఈ క్రమంలో ఈ సినిమాకి వెంకటేష్‌ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఆయన గత చిత్రాలతో పోల్చితే త్రిబుల్‌ చేశారట. `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ వరకు ఆయన పది పదిహేను కోట్ల వరకే తీసుకున్నారు. ఇప్పుడు `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెంబర్‌ 47`(ఏకే47) చిత్రానికి త్రిబుల్‌ చేశారట. సుమారు రూ.35-40కోట్ల వరకు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం. వెంకీకి ఉన్న మార్కెట్‌, మహిళా ఆడియెన్స్ లో ఉన్న ఫాలోయింగ్‌, ఓటీటీ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.

44
చిరంజీవి పోటీగా వెంకీ పారితోషికం

సీనియర్‌ హీరోల్లో చిరంజీవి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచారు. ఆయన నలభై నుంచి యాభై కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు వెంకటేష్‌ కూడా ఆ తర్వాత స్థానంలోకి చేరడం విశేషం. మరోవైపు బాలయ్య కూడా ముప్పై కోట్లకుపైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని టాక్‌. కాకపోతే నాగార్జున మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఏదేమైనా వరుస విజయాలతో ఉన్న వెంకటేష్‌ `ఆదర్శ కుటుంబం` మూవీకి తీసుకుంటున్న పారితోషికం ఆసక్తికరంగా, హాట్‌ టాపిక్‌గా మారింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories