Sreeleela: టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టి ఆమె సృష్టించిన ఆ కొత్త రికార్డ్ ఏంటో చూద్దాం.
శ్రీలీల క్రేజ్ సినిమాలకే పరిమితం కాలేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ, బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ శ్రీలీల ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ సాలిడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె పోస్ట్‌కు వచ్చిన లైక్స్, వ్యూస్ చూస్తే ఈ భామ డిజిటల్ పవర్ ఏంటో అర్థమవుతుంది.
25
కోట్లల్లో లైక్స్ సాధించిన హీరోయిన్..
ఇటీవల శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోకు ఏకంగా 1.11 కోట్లు (11.1 మిలియన్లు) లైక్స్ వచ్చాయి. అంతేకాదు, 25.8 కోట్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. సాధారణంగా స్టార్ హీరోల పోస్టులకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. కానీ, శ్రీలీల పోస్ట్‌కు ఏకంగా కోట్లల్లో లైక్స్ రావడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది.
35
దళపతి విజయ్ రికార్డును బ్రేక్ చేసిన బ్యూటీ..
ఈ దెబ్బతో సోషల్ మీడియాలో అత్యధిక లైక్స్ సాధించిన ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. తమిళ స్టార్ దళపతి విజయ్ పేరిట ఉన్న 97 లక్షల లైక్స్ రికార్డును శ్రీలీల ఈ పోస్ట్‌తో బ్రేక్ చేసింది. అదే సమయంలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోస్టులకు వచ్చిన లైక్స్‌ను కూడా ఆమె దాటేసిందని నెట్టింట గట్టి చర్చ నడుస్తోంది.
శ్రీలీల సోషల్ మీడియా క్రేజ్‌కు ఆమె డ్యాన్స్ స్కిల్స్ ప్రధాన కారణం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే డ్యాన్స్ వీడియోలు, ఫోటోషూట్లు, పర్సనల్ మూమెంట్స్‌కు ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. చిన్ననాటి భరతనాట్యం వీడియోల నుంచి లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్ల వరకు.. ఆమె అకౌంట్‌లో ఎప్పుడూ వెరైటీ కంటెంట్ కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీలను ఏకంగా 1.65 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టే ఆన్‌లైన్‌లో ఆమె పాపులారిటీ ఏంటో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో ఆమె డ్యాన్స్ స్టెప్పులు ఎలా ట్రెండ్ అవుతాయో, సోషల్ మీడియా పోస్టులు కూడా ఫ్యాన్స్ మధ్య అంతే ట్రెండ్ అవుతాయి.
55
ఆమె స్టార్‌డమ్ మరో లెవల్...
వెండితెరపై తన డ్యాన్స్, యాక్టింగ్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె క్రియేట్ చేసిన ఈ కొత్త రికార్డ్.. ఆమె స్టార్‌డమ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
మొత్తానికి వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా శ్రీలీల హవా గట్టిగానే నడుస్తోంది. ఒకే ఒక్క వీడియోకు కోట్లల్లో లైక్స్, వ్యూస్ రావడం ద్వారా తన సోషల్ మీడియా పవర్‌ను ఆమె మరోసారి ప్రూవ్ చేసుకుంది. రాబోయే రోజుల్లో ఆమె సినిమాలు రిలీజ్ అయ్యే టైమ్‌లో ఈ డిజిటల్ క్రేజ్ ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి.