టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున వారసులు హీరోలుగా కొనసాగుతుండగా.. బాలయ్య, వెంకటేష్ తనయుల రాకకోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వెంకటేష్ కొడుకు అర్జున్ టాలీవుడ్ ఎంట్రీపై ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చి.. తమ ట్యాలెంట్ తో నిలబడి చూపించారు. ఎంత వారసత్వంగా వచ్చినా.. వారిలో ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతారు అలా ట్యాలెంట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. త్వరగా వెళ్లిపోయినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే మన తెలుగు పరిశ్రమలో మాత్రం స్టార్ హీరోలు, నిర్మాతల వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి హీరోలు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారో తెలిసిందే. అంతే కాదు ఈ హీరోల వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. ఇచ్చారు కూడా.
25
ఫ్యామిలీ హీరోగా వెంకటేష్
ఇప్పటికే నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతుండగా.. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యింది. ఇక వెంకటేష్ తనయుడు అర్జున్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి వారసులుగా ఇప్పటికే రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వెంకటేష్ తనయుడి రాక కోసం విక్టరీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంట్లో ఉన్న ఆడవారిని కూడా థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన హీరో వెంకీ. ఆయన సినిమాలు ఫ్యామిలీ అంతా చూడదగినవిగా ఉంటాయి.
35
వెంకటేష్ వారసుడి కోసం అభిమానుల వెయిటింగ్
ఒకప్పుడు శోభన్ బాబు సినిమాలు చూసేందుకు ఇలా ఫ్యామిలీ అంతా కదిలి వచ్చేవి. ఆతరువాత ఆ ఇమేజ్ వెంకటేష్ సాధించాడు. అంతే కాదు ఆయనకు రీమేక్ ల రారాజుగా పేరుంది. ఇతర భాషల్లో హిట్ అయిన ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ను తీసుకుని.. తెలుగులో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసేవారు వెంకీ. సెంటిమెంటల్ కథలతో పాటు, మాస్, ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాల్లో కూడా నటిస్తూ వెంకటేష్ తనదైన మార్క్‌ను చూపించాడు. ఈ విధంగా విభిన్న శైలుల్లో సినిమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కోనసాగుతున్నాడు వెంకీ.
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటేష్ కుమారుడు అర్జున్‌ను కూడా త్వరలోనే ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్‌కు నటనకు సంబంధించిన శిక్షణ కోసం విదేశాల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారన్న టాక్ బలంగా నడుస్తోంది. వెంకటేష్ తన వారుసుడిని ఎప్పుడు సినిమాల్లోకి తీసుకువస్తారన్న అంశంపై చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇంకా అర్జున్ కు హీరో అయ్యే ఏజ్ రాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. , వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అర్జున్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
55
డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?
అయితే వెంకటేష్ తనయుడి సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నవిషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. యంగ్ డైరెక్టర్లతో వెంకీ తన కుమారుడి ఎంట్రీని ప్లాన్ చేశారట. ఒక వాదన ప్రకారం మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కుమారుడి డైరెక్షన్ లో వెంకీ తనయుడి ఎంట్రీ ఉంటుందని సమాచారం. అంతే కాదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా త్రివిక్రమ్ తనయుడి డైరెక్షన్ లో నే ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.