5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Published : Dec 23, 2025, 09:25 PM IST

ప్రస్తుతం ఒక్క పాటకు కోట్లు సంపాదిస్తోన్న నటి.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు అనుభవించింది. చేతిలో 5 వేలతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ 5 నిమిషాలు నటిస్తు చాలు కోట్లు డిమాండ్ చేస్తోంది.ఇంతకీ ఎవరా హీరోయిన్? 

PREV
15
ఫిల్మ్ ఇండస్ట్రీలో అదృష్టం ఉండాలి..

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో ముందుగా చెప్పడం కష్టం. ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్‌లుగా మారినవారు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా ఉన్నారు. కొందరు కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి కోట్లు సంపాదిస్తే, మరికొందరు కెరీర్ ప్రారంభంలోనే అవకాశాలు రాక ఈ రంగాన్ని విడిచిపెట్టారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం పట్టుదలతో ముందుకు సాగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

25
కింద స్థాయి నుంచి ఎదిగిన హీరోయన్

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి ఊపుమీద ఉన్న స్టార్ బ్యూటీల్లో నోరా ఫతేహీ ఒకరు. అయితే ఆమె సక్సెస్ వెనుక.. ఎన్నో ఏళ్ళ కష్టం దాగి ఉంది. ఆమె ప్రయాణం అంత సులభంగా జరగలేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు ఎదుర్కొని, కేవలం ఐదు వేల రూపాయలతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఐదు నిమిషాలు నటించినందుకు 3 కోట్లు వసూలు చేసే స్థాయికి వెళ్లింది.

35
ఎన్నో అవమానాలు ఫేస్ చేసిన నోరా ఫతేహీ

నోరా ఫతేహీ సినిమాలపై ఉన్న ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో ఆమె ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నట్టు సమాచారం. అవకాశాల కోసం ఆడిషన్లకు తిరిగిన రోజులు, సరైన గుర్తింపు రాక ఇబ్బందులు పడిన సందర్భాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఒక గుడ్డు, బ్రెడ్‌తో రోజులు గడిపిన పరిస్థితులు కూడా నోరా జీవితంలో ఎదురయ్యాయి. కెనడా నుంచి కేవలం ఐదు వేల రూపాయలతో భారత్‌కు వచ్చిన నోరా ఫతేహీ, అంచెలంచెలుగా ఎదుగుతూ తన కెరీర్‌ను నిర్మించుకుంది.

45
సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్

బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సౌత్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్‌కు నోరా ఫతేహీ పెట్టింది పేరు. ఐటమ్ సాంగ్స్ ద్వారానే ఆమెకు భారీ గుర్తింపు లభించింది. తెలుగు సినిమాల్లో ‘టెంపర్’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌లో నోరా ఫతేహీకి సౌత్ లో మంచి పేరు తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆమె చేసే ఐటమ్ సాంగ్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఐదు నిమిషాల పాటకు దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

55
నోరా ఫతేహీ ఆస్తుల వివరాలు..

నోరా బిజీ ఆర్టిస్ట్ గా ఉంది. అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినిమాల్లో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. డిమాండ్ తో పాటు ఆమె సంపాదన కూడా పెరిగింది. ప్రస్తుతం నోరా ఫతేహీ సుమారు 60 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. మంచి ఇల్లు, లగ్జరీ కార్లతో ఆమె హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవడం ఆమె పట్టుదల, కష్టానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories