Sankranthiki Vasthunam OTT: 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అఫీషియల్ గా రిలీజ్ డేట్ ఇచ్చారు. థియేటర్లో తొలగించిన కామెడీ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో చూడవచ్చు.
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu
Sankranthiki Vasthunam OTT: అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబోలో రిలీజైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ఫుల్ రన్‌లో దాదాపు రూ.300 కోట్లు (గ్రాస్)పైగా వసూలు (sankranthiki vasthunam collection) చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని సైతం విపరీతంగా ఆకట్టుకుంది. వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది.
23
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu
అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని కూడా జీ5 చెప్పేసింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6గంటల అటు జీ తెలుగులోనూ ఇటు జీ5 ఓటీటీలోనూ ఒకేసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam OTT) అందుబాటులోకి రానుంది. జీ5 తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన సరికొత్త ప్రోమోలో ఈ విషయాన్ని తెలియజేసింది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థియేటర్‌లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారట. తాజాగా ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలన్నిటినీ యాడ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మార్చి 1న స్ట్రీమింగ్ కానున్న వెర్షన్‌లో ఉంచుతారేమో చూడాలి..
33
Venkatesh Sankranthiki Vasthunam OTT release date in telugu
వెంకటేశ్‌ల మధ్య కొన్ని కామెడీ సీన్స్‌ను యాడ్ చేయనున్నారు. ఈ సీన్స్ సినిమాకు మరింత బలాన్నిస్తాయని టీమ్ భావిస్తోంది. అలాగే మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ల మధ్య కూడా మరికొన్ని సన్నివేశాలు కలపనున్నారట.
ఈ విషయంపై టీమ్ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇటీవల ‘పుష్ప2’ సహా పలు చిత్రాల ఓటీటీ వెర్షన్స్‌లో అదనపు సన్నివేశాలను జోడించి అందుబాటులోకి తెచ్చారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. సాయి కుమార్, వీటీ గణేష్, శ్రీనివాస్ అవసరాల, ప్రిథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో ముఖ్యంగా బుల్లిరాజు సినిమాకే హైలైట్ గా నిలిచింది.