అయితే చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో మొదలైన ఒక చిత్రం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ఆ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలని అప్పటి స్టార్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఎందుకంటే ఆ చిత్రం ప్రారంభమైంది ఆయన దర్శకత్వంలోనే. చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా కోదండ రామిరెడ్డి ఒక చిత్రాన్ని ప్రారంభించారు. విశేషం ఏంటంటే ఆ చిత్రానికి నిర్మాత శ్రీదేవి. శ్రీదేవి ఎంతో ఇష్టపడి తనకి, చిరంజీవికి అయితే ఈ మూవీ బావుంటుంది అని సొంతంగా నిర్మించేందుకు రెడీ అయింది.