Sankranthi Movies 2025
2025 సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం... వరుసగా విడుదలవుతున్నాయి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోల్చితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై కొంత హైప్ తక్కువగా ఉంటుంది. అందుకు కారణం.. హీరో వెంకటేష్ స్టార్డం తగ్గింది. ఆయనకు సోలోగా హిట్స్ పడటం లేదు. గత చిత్రం సైంధవ్ నిరాశపరిచింది. డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది.
వెంకటేష్ తో పోల్చితే రామ్ చరణ్, బాలకృష్ణ ఫేమ్ లో కూడా ఒక మెట్టు పైన ఉన్నారు. కాబట్టి సంక్రాంతి రేసులో వారిని ఢీ కొట్టాలంటే వెంకటేష్... బాగా కష్టపడాలి. మాది పక్కా సంక్రాంతి సినిమా అని జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎంటర్టైన్మెంట్ కి ఢోకా లేదనే గ్యారంటీ ఇవ్వాలి. ఇదే పనిలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఇండస్ట్రీని ఆకర్షిస్తుంది.
Sankranthi 2025
ఫస్ట్ సింగిల్ మేకింగ్ నుండే తన ప్రణాళిక అమలు చేయడం ఆరంభించాడు. ఒకప్పటి స్టార్ సింగర్ కమ్ కంపోజర్ రమణ గోగులతో 'గోదారి గట్టు మీద రామచిలుకవే' సాంగ్ పాడించారు. ఒక భిన్నమైన వాయిస్ తో శ్రోతలను ఆకట్టుకుంటారు రమణ గోగుల. ఆయనతో సాంగ్ పాడించాలన్న ఆలోచన రావడంతోనే అనిల్ రావిపూడి సగం సక్సెస్ అయ్యారు. ఆయన పాడిన 'గోదారి గట్టు మీద'' సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబట్టింది. ఎక్కడ చూసినా ఆ పాట వినిపిస్తుంది.
Sankranthi 2025
మూడో సాంగ్ ని వెంకటేష్ తో పాడించారు. థర్డ్ సింగిల్ విడుదలకు ముందు వెంకీ మీద ఓ ఫన్నీ వీడియో షూట్ చేశారు. మూడో సాంగ్ నేనే పడతా అని అనిల్ రావిపూడిని వెంకటేష్ ఇబ్బంది పెట్టినట్లు వీడియో రూపొందించారు. ఇది వీడియో తెగ నచ్చేసింది. బ్లాక్ బస్టర్ పొంగలు అంటూ వెంకీ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు.
Sankranthi 2025
తాజాగా అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని రంగంలోకి దించాడు. వెంకటేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా ఉన్న బొబ్బిలి రాజా, చంటి చిత్రాల్లోని ఆయన గెటప్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వేశారు. సదరు చిత్రాల పాటలకు డాన్సులు వేశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
Sankranthi 2025
అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని తన వినూత్న ఆలోచనలతో ప్రమోట్ చేస్తూ హైప్ రైజ్ చేస్తన్నారు. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడితో పోల్చితే.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల దర్శక నిర్మాతలు, నటులు వెనుకబడ్డారు. అనిల్ రావిపూడితో వారు పోటీ పడలేకున్నారు. కాగా ఎంత పెద్ద స్టార్ నటించినా, ఒక మూవీకి ప్రమోషన్స్ చాలా అవసరం.
Sankranthi 2025
లాల్ సలాం, వేట్టయాన్ చిత్రాలను సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేయలేదు. టాలీవుడ్ స్టార్స్ కి సమానమైన ఫేమ్ కలిగిన రజినీకాంత్ నటించిన ఆ చిత్రాలకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు కారణం.. ప్రమోషన్స్ వీక్ ఉండటమే. అసలు లాల్ సలాం వచ్చిన పోయిన విషయం కూడా జనాలకు తెలియదు. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా... ప్రమోషన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాకు ఎక్కడలేని హైప్ తీసుకున్నాడు అనిల్ రావిపూడి.