మాస్టర్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్. అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. నిర్మాతలు ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
కాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతలకు బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ... అభిమాని రాసిన లేఖ వైరల్ అయ్యింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. విడుదల సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఫ్యాన్స్ కోరిక నెరవేర్చారు.
న్యూ ఇయర్ సందర్భంగా నేడు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించారు. జనవరి 2వ తేదీ సాయంత్రం 5:04 గంటలకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇక ప్రకటన పోస్టర్ లో పంచె కట్టులో రామ్ చరణ్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. కాబట్టి మరికొన్ని గంటల్లో గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేయనుంది.
Game Changer
గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ పాత్రలో ఆయన ఉన్నత భావాలు కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. మరొక పాత్రలో నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి. రెండు భిన్నమైన పాత్రల్లో రామ్ చరణ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు పొలిటికల్ థ్రిల్లర్స్ లో ట్రెండ్ సెట్టర్. చాలా ఏళ్ల తర్వాత శంకర్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కించారు.
దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 50వ చిత్రంగా గేమ్ ఛేంజర్ తెరక్కుతుంది. కేవలం సాంగ్స్ చిత్రీకరణకు శంకర్ రూ. 75 కోట్లు ఖర్చు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ కెమెరాలు వినియోగించారట. అనుకోని కారణాలతో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. శంకర్ రేంజ్ మూవీ వచ్చి చాలా కాలం అవుతుంది. గేమ్ ఛేంజర్ తో వింటేజ్ శంకర్ ని చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
pushpa 2 director sukumar gives first review of game changer movie by shankar and ram charan
రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ అందుతుంది. సుకుమార్, ఎస్ జే సూర్య వంటి ప్రముఖులు గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ గ్యారంటీ అని సుకుమార్ అన్నారు.