Sankranthiki Vasthunam Movie: వెంకటేష్‌ సంచలనం, తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డ్.. సీనియర్లకి ఝలక్‌

Published : Feb 01, 2025, 07:17 AM IST

Sankranthiki Vasthunam Movie create new record: వెంకటేష్‌ టాలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. సీనియర్లకి షాకిస్తూ `సంక్రాంతికి వస్తున్నాం`తో సంచలనం సృష్టించారు. ఏకంగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరిపోయారు.   

PREV
14
Sankranthiki Vasthunam Movie: వెంకటేష్‌ సంచలనం, తెలుగు సినిమా చరిత్రలో కొత్త రికార్డ్.. సీనియర్లకి ఝలక్‌
photo credit- aha-unstoppable 4

Venkatesh Create New Record: విక్టరీ వెంకటేష్‌ సంచలనం సృష్టించారు. సీనియర్‌ హీరోల్లో ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే వెంకీమామ నయా రికార్డులు తిరగరాశారు. ఇటీవల కాలంలో సక్సెస్‌ ట్రాక్‌లోనే లేని వెంకటేష్ ఇప్పుడు అందరికి షాకిస్తూ తెలుగు సినిమాకి(పాన్‌ ఇండియా కాకుండా) సంబంధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా నిలిచారు. 

24

వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ మూవీ తాజాగా రూ.300కోట్ల క్లబ్‌లో చేరింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేయడం విశేషం. కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా `సంక్రాంతికి వస్తున్నాం` మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు 300కోట్ల క్లబ్‌లో చేరి తొలి చిత్రంగా నిలిచింది. అది తెలుగు సినిమాగానూ, సీనియర్‌ హీరోల సినిమాల పరంగానూ ఇది నయా రికార్డ్ క్రియేట్‌ చేయడం విశేషం. 
 

34

సాధారణంగా సినిమా హిట్‌ అయితే దర్శక, నిర్మాతలు బయ్యర్లకి, టీమ్‌కి పార్టీ ఇస్తారు. కానీ ఈ సినిమా బయ్యర్లే టీమ్‌కి పార్టీ ఇస్తున్నారు. వాళ్లే ప్రెస్‌ మీట్‌ పెట్టి మేకర్స్ కి థ్యాంక్స్ చెప్పబోతున్నారు. శనివారం మధ్యాహ్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సినిమా కొన్న వారికి ఆల్మోస్ట్ 8టైమ్స్ లాభాలు రావడం విశేషం. ఓ రకంగా కాసుల వర్షం కురిపించిందని చెప్పొచ్చు. 

44

`సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ఈ స్థాయి కలెక్షన్లకి,ఇంతటి ఆదరణకు కారణం చాలా కాలం తర్వాత వెంకటేష్‌ నుంచి ప్రాపర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావడమే. ఇటీవల కాలంలో ఆయన యాక్షన్‌ మూవీ, థ్రిల్లర్‌ మూవీస్‌ ఎక్కువగా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎలిమెంట్లు, కామెడీ, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అలకలు, కోపాలు, అసూయలు ఇలా అన్నింటిని మేళవించి చేసిన సినిమాలు లేవు.

దీంతో ఆ లోటు కనిపిస్తుంది. అంతా యాక్షన్‌సినిమాల వైపు పరిగెడుతున్నారు. ఫ్యామిలీని థియేటర్ కి రప్పించే సినిమాలు రావడం లేదు. చాలా కాలం తర్వాత అలాంటి సినిమా రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్కి క్యూ కడుతున్నారు. సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

ఫ్యామిలీ ఆడియెన్స్ కి సినిమా నచ్చితే ఏ రేంజ్‌లో వసూళ్లు వస్తుందో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ నిరూపించింది. నేలవిచిడిచి సాము చేస్తున్న ఎంతో మంది మేకర్స్ కిది కనువిప్పులా, ఓ గుణపాఠంలా నిలిచింది.  

read  more:విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు ఎందుకు తగ్గించింది? ఆమె భర్తనే ఆ పని చేశాడా?

also read: రజినీతో 1000 కోట్ల దర్శకుడి సినిమా, హీరోయిన్ గా రష్మిక.. మరో సూపర్‌ స్టార్‌ కూడా

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories