
సౌత్ సినిమాలు, దర్శకులకు ఇప్పుడు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది. షాహిద్ కపూర్ టైటిల్ రోల్‌లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యారు.
‘దేవా’ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రమోషన్స్ లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే వదిలారు. వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని హైలెట్ చేసారు. దాంతో ఇక్కడ మనవాళ్లలో కూడా ఏంటా సినిమా, హిట్టైతే ఇక్కడ రీమేక్ చేయచ్చు కదా అనే ఊహ కూడా కొందరు సినిమా వాళ్లలో మెదిలింది. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి, సినిమా నార్త్ లో మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉందా చూద్దాం.
స్టోరీ లైన్
ముంబై క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే దేవ్ (షాహిద్ కపూర్) తన కొలీగ్ రోహన్ డిసిల్వ (పావైల్ గులాటి) ని ఎవరో కాల్చి చంపేస్తారు. ఆ కేసుని దేవ్ డీల్ చేయటం ప్రారంభిస్తాడు. అయితే ఓరోజు మర్డర్‌ను ఎవరు చేశారో తాను తెలుసుకున్నానని, కమిషనర్ ఫర్హాన్ (పర్వేశ్ రాణా)కు కి ఫోన్ చెబుతాడు. అదే సమయంలో దేవ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. తాను గతమంతా మరచిపోతాడు.
దేవ్ గతాన్ని మరచిపోయాడనే నిజం కమీషనర్ ఫర్హాన్ కి మాత్రమే తెలుసు. దాంతో తను ఆ విషయాన్ని దాచి పెట్టి మళ్లీ రోహన్ డిసిల్వ కేసుని డీల్ చేయమని దేవాకు చెప్తాడు. అక్కడ నుంచి దేవా చేసిన ఇన్విస్టిగేషన్ లో ఓ ఊహించని షాకింగ్ నిజం బయిటపడుతుంది. అదేమిటి... దేవాకి మళ్ళీ గతం గుర్తు వచ్చిందా? రోహన్ డిసిల్వను చంపిన హంతకుడు ఎవరో కనిపెట్టాడా? జర్నలిస్టు దివ్య సతాయే (పూజా హెగ్డే)కు దేవ్ ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ కథ చదువుతుంటే గతంలో ఎక్కడో విన్నట్లు, చూసినట్లు అనిపిస్తోందా. కరెక్టే..తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హంట్' అనే సినిమా ఇది. 'హంట్' సినిమా మళయాళంలో ఇదే దర్శకుడు చాలా కాలం క్రితం పృధ్వీరాజ్ సుకుమార్ తో చేసిన ముంబై పోలీస్ సినిమా రీమేక్. తెలుగులో డిజాస్టర్ అయ్యింది. అందుకు కారణం సినిమా చివర్లో సుధీర్ బాబు గే అని తేలటం అని తేల్చారు.
మళయాళంలో పన్నెండేళ్ల క్రితం వర్కవుట్ అయ్యి హీరో గే అనే ఎలిమెంట్ తెలుగులో పో బే అన్నట్లు గా మార్చేసింది. దాంతో ఇప్పుడు హిందీ లో ఆ ఎలిమెంట్ ని లేపేసి, మిగతా స్క్రీన్ ప్లే,స్టోరీని అలాగే ఉంచి నడిపారు. అయినా అనుకున్న స్దాయిలో సినిమా కిక్ ఇవ్వలేదు. పదిహేనేళ్ల క్రితం సినిమాని చూస్తున్న ఫీల్ నే తీసుకొచ్చింది. కొత్త కథ అనిపించలేదు. ఇప్పుడు కాలానికి తగినట్లు అప్డేట్ కాలేదనిపించింది.
సినిమా ఓపినింగ్ క్రెడిట్స్లో ముంబై స్పిరిట్ ను, అమితాబ్ స్టార్డమ్ ని గుర్తు చేస్తూ ఓ మూడ్ ని క్రియేట్ చేస్తారు. దాంతో సినిమా స్టార్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. మర్డర్ కేసుని సాల్వ్ చేసిన ఓ పోలీస్ ఆఫీసర్ .. అనుకోకుండా గతాన్ని మరచిపోతాడు. తను చివరకు ఎలా కేసుని డీల్ చేశాడనేదే కథ. అక్కడ నుంచి ఓ పజిల్ లా సీన్స్ పేర్చుకుంటూ , వాటిని చూసేవారు కలుపుకునేలా డిజైన్ చేసారు. అంతవరరూ బాగుంది.
ఫస్టాఫ్ స్మూత్ గా నీట్ గా వెళ్లిపోతుంది. అయిే సెకండాఫ్‌లో కూడా ఏమీ జరగదు. ఫస్టఫ్ లో జరిగినట్లే సీన్స్ వెళ్తూంటాయి. ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కూడా సినిమా అంతే ఓకే ప్యాట్రన్‌లోనే ఉంటుంది. అయితే చివరి ఇరవై నిమిషాలు ఫరవాలేదనిపిస్తుంది. అయితే మారిన ఆడియన్స్ కు తగినట్లుగా ఇంకాస్త ఎంగేజింగ్‌గా మార్చి ఉండుంటే బావుండేదనిపించింది.
కెమెరామెన్ అమిత్ రాయ్, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ ఈ సినిమాని ఎంగేజింగ్ గా చేయటానికి ప్రయత్నించారు. షాహిద్ కపూర్ కు వంక పెట్టడానికి ఏమీ లేదు. 'ఉడ్తా పంజాబ్', 'కబీర్ సింగ్', 'హైదర్' ని గుర్తు చేసేలా పర్ఫామెన్స్ ఇచ్చారు. పూజ హెగ్డే చేయటానికి పెద్దగా ఏమీలేదు. సినిమాటెక్ జర్నలిస్ట్ క్యారెక్టర్ , స్క్రీన్ టైమ్ తక్కువ.
ఫైనల్ థాట్
ఇప్పటికీ మీరు మళయాళంలో ముంబై పోలీస్, తెలుగులో హంట్ సినిమాలు చూడకపోయి ఉండి, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు అయితే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.
బ్యానర్: జీ స్టూడియోస్, రాయ్ కపూర్, ఫిల్మ్స్
నటీనటులు: షాహిద్ కపూర్, పూజా హెగ్డే, పవైల్ గులాటీ, పర్వేష్ రానా తదితరులు
సినిమాటోగ్రఫి: అమిత్ రాయ్
ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
పాటలు: విశాల్ మిశ్రా, జేక్స్ బిజోయ్
దర్శకత్వం: రోషన్ అండ్రూస్
నిర్మాత: సిద్దార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ భన్సల్
రిలీజ్ డేట్: 2025-01-31