Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌

Published : Sep 30, 2026, 09:38 AM IST

విక్టరీ వెంకటేష్‌.. లెజెండరీ నిర్మాత డి రామానాయుడు కొడుకు అనే విషయం తెలిసిందే. అయితే తొలి సినిమా ఎంట్రీ విషయంలో జరిగిన సంఘటనని తాజాగా ఆయన పంచుకున్నారు. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టాడట.

PREV
15
ఆదర్శ కుటుంబంతో రాబోతున్న వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. మధ్యలో `మన శంకర వర ప్రసాద్‌గారు` మూవీలో మెరిసి మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్‌ 47`(ఏకే47) చిత్రంలో నటిస్తున్నారు. ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన చిత్రమిది. అక్టోబర్‌ 9న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వెంకటేష్‌.. తన మొదటి సినిమా అనుభవాలను పంచుకున్నారు.

25
ఏఎన్నార్‌ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌ ప్రేమ్‌ నగర్‌

వెంకటేష్‌ నాన్న రామాయుడు పెద్ద నిర్మాత అనే విషయం తెలిసిందే. సురేష్‌ ప్రొడక్షన్స్ పతాకంపై అనేక చిత్రాలు నిర్మించారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్ ల్లోకి ఎక్కారు. అయన అక్కినేని నాగేశ్వరరావుతో `ప్రేమ్‌ నగర్‌` మూవీని నిర్మించారు. కేఎస్‌ ప్రకాష్‌రావు దర్శకుడు. ఈ చిత్రంలో ఏఎన్నార్‌కి జోడీగా వాణిశ్రీ నటించింది. ఈ సినిమా 1971లో విడుదలైంది. పెద్ద విజయం సాధించింది. ఏఎన్నార్‌ కెరీర్‌లోనే ఒక కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంది.

35
ప్రేమ్‌ నగర్‌లో బాలనటుడిగా వెంకటేష్‌ ఎంట్రీ

ఇందులో ఏఎన్నార్‌, కైకాల సత్యనారాయణ అన్నదమ్ములుగా నటించారు. కైకాల సత్యనారాయణ నటించిన కేశవ వర్మ పాత్ర చిన్నప్పటి రోల్ లో వెంకటేష్‌ నటించాడు. ఆయనకిది తొలి చిత్రం. బాలనటుడిగా తేరంగేట్రం చేసిన సినిమా ఇదే. అయితే ఇది చాలా యాదృశ్చికంగా జరిగింది. సినిమా షూటింగ్‌ సమయంలో ఇలా బాలనటుడు అవసరం ఉంది. అందుకు ఎవరినో వెతకడం ఎందుకు వెంకటేష్‌బాబునే పెడదామని, దర్శకుడు, టీమ్‌ భావించారు. రామానాయుడుకి చెబితే ఆయన కూడా ఓకే చెప్పారు. అప్పుడు వెంకటేష్‌ స్కూల్‌లో చదువుతున్నారు. వెంకీకి షూటింగ్‌లకు వెళ్లి చూసిన అలవాటు ఉంది.

45
వెంకటేష్‌ తొలి పారితోషికం

దీంతో మేనేజర్‌ వచ్చి నాన్నగారు రమ్మంటున్నారు, ఇలా సినిమాలో యాక్ట్ చేయాలట అని చెప్పారట. దానికి వెంకటేష్‌ నో చెప్పాడు. నేను ఎందుకు రావాలి, వెయ్యి రూపాయలు ఇస్తేనే వస్తానని కండీషన్‌ పెట్టాడట. ఆ మేనేజర్‌ వెళ్లి మళ్లీ వచ్చాడు. వెయ్యి రూపాయలు ఇస్తామంటున్నారు, రమ్మన్నారు అని చెప్పడంతో, వెంకీ ఆ వెయ్యి రూపాయలకు ఆశపడి షూటింగ్‌కి వెళ్లాడు. అయితే ఆ సమయంలో జూ ఆర్టిస్ట్ లకు డబ్బులు ఇచ్చేవారు కదా, అది వెంకీ చూశాడు. దీంతో తనకు కూడా డబ్బులు ఇస్తారని చెప్పి సొంత తండ్రికే వెయ్యి రూపాయలు డిమాండ్‌ చేశాడట. అలా ఫన్నీగా తన సినిమా ఎంట్రీ జరిగిందని, అప్పటి వరకు తనకు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన లేదని చెప్పారు. మొత్తంగా వెంకటేష్‌ తొలి పారితోషికం వెయ్యి రూపాయలుగా చెప్పొచ్చు.

55
ఆదర్శకుటుంబానికి వెంకటేష్‌ పారితోషికం

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం `ఆదర్శకుటుంబం`. ఫ్యామిలీ అంశాల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. తన ఫ్యామిలీకి కష్టం వస్తే, హీరో తనలోని అసలుకోణాన్ని చూపించడమే ఈ చిత్ర కథ. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి వెంకటేష్‌ పారితోషికం రూ.35-40కోట్లు ఉంటుందని సమాచారం. వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయిన ఆయన కెరీర్‌ ఇప్పుడు ఒక్క మూవీకి నలభై కోట్లు తీసుకునే స్థాయికి వచ్చారు వెంకీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories