Nagarjuna: శోభనం పాటలో 'రాముడు', శివ శివా.. తప్పు అర్థం రాకుండా లిరిసిస్ట్ ఎలా రాశారో తెలుసా, హ్యాట్సాఫ్

Published : Sep 30, 2026, 09:05 AM IST

శోభనం నేపథ్యంలో వచ్చే రొమాంటిక్ సాంగ్ లో రామా అనే పదం ఉండాలి అని దర్శకుడు కండిషన్ పెట్టారు. తప్పు అర్థం రాకుండా రామా అనే పదాన్ని వాడుతూ లిరిసిస్ట్ ఎంత అద్భుతంగా ఆ పాటని రాశారో ఈ కథనంలో తెలుసుకోండి.

PREV
15
లిరిసిస్ట్ చంద్రబోస్

తెలుగులో గొప్ప సినీ గేయ రచయితల్లో చంద్రబోస్ ఒకరు. ఆస్కార్ అవార్డుని ముద్దాడిన రచయిత ఆయన. ఎన్నో అద్భుతమైన పాటలని చంద్రబోస్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. 1995 లో తాజ్ మహల్ చిత్రంతో లిరిసిస్ట్ గా చంద్రబోస్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి సందడి, చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, తమ్ముడు, మురారి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు పాటలు అందించడంతో చంద్రబోస్ కి గుర్తింపు దక్కింది.

25
అగ్ర దర్శకుల సినిమాలకు సాహిత్యం

పాన్ ఇండియా డైరెక్టర్లు రాజమౌళి, సుకుమార్ సినిమాలకు చంద్రబోస్ వరుసగా పాటలు రాశారు. సుకుమార్ ప్రతి సినిమాలో చంద్రబోస్ సాహిత్యం ఉంటుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి ప్రపంచాన్ని ఊపేశారు. అంతే కాదు ఆ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇంతటి ప్రతిభ ఉన్న చంద్రబోస్ దర్శకులు ఇచ్చే సవాల్ ని స్వీకరించి పాటలు రాస్తారట. శ్రీరామదాసు సినిమా విషయంలో చంద్రబోస్ కి ఒక ఛాలెంజ్ ఎదురైంది.

35
శ్రీరామదాసు మూవీలో అవకాశం

చంద్రబోస్ మాట్లాడుతూ పెళ్లి సందడి మూవీలో సరిగమపదనిస రాగం అనే పాటతో రాఘవేంద్ర రావు, కీరవాణిలతో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి రాఘవేంద్ర రావుగారి ప్రతి సినిమాకు పాటలు రాస్తున్నా. నాలోని కవిని బాగా గుర్తించిన దర్శకుడు రాఘవేంద్ర రావు. ఒక రోజు నన్ను రాఘవేంద్ర రావు గారు పిలిచారు. వెళ్ళాను. శ్రీరామదాసు సినిమాకు ఒక పాట రాయాలి అని అన్నారు. అప్పటికి ఆ సినిమాలో పాటలన్నీ రెడీ అయ్యాయి. నేను రాయాల్సిన పాట మాత్రమే మిగిలి ఉంది. ఆ పాటలన్నీ నాకు వినిపించారు. అన్ని పాటలు బావున్నాయి సార్.. ఈ పాటని కూడా బాగా రాస్తాను అని చెప్పా. కానీ నీకో షరతు అన్నారు.

45
శోభనం పాట, అయినా రామ అని ఉండాలి

అన్ని పాటల్లో 'రామ' అనే పదం ఉంది కదా.. ఈ పాటలో కూడా రామ రావాలి అని అన్నారు. ఓకె సార్ దానిదేముంది అలాగే వస్తుంది సందర్భం చెప్పండి అని అడిగాను. రామదాసు రామదాసు కాకముందు కంచర్ల గోపన్న గా ఉన్నప్పుడు పెళ్లి జరుగుతుంది. తర్వాత శోభనం పాట వస్తుంది. ఆ పాటని నువ్వు రాయాలి అని అన్నారు. శివ శివా శోభనం పాటలో 'రామ' అని రావాలా.. ఇదెక్కడి మెలిక అని అనుకున్నా. శోభనం పాటలో రాముడు ఎలా వస్తాడు సార్ అని అడిగా.. మరి అదే నీకు ఛాలెంజ్ అని అన్నారు. ఛాలెంజ్ ని స్వీకరించి పాట రాయడం మొదలు పెట్టాను.

55
చంద్రబోస్ చేసిన అద్భుతం, తెలుగు లిరిక్స్ ఇవే

రామ అనే పదం రావాలి.. శోభనం పాట అయినప్పటికీ తప్పు అర్థం ఉండకూడదు ఎలా అని ఆలోచిస్తూ పాట రాయడం ప్రారంభించా. పల్లవి పూర్తి చేశా. అందులో రామ ఉండదు. కానీ చరణంలో తప్పనిసరిగా రామ ఉండాలి. నీ కరములు... నా మేనికి వశీకరములు...అని చరణం ప్రారంభించా. మధ్యలో 'రా మా ఇంటికి మన్మథుడా... అను పిలుపులు...' అని రాశాను. ఇంతటి అందమైన రాత్రి మన్మథుడు లాంటి నిన్ను ఇంటికి రమ్మని మనసు ఆహ్వానిస్తోంది అని ఆ వాక్యం అర్థం. రెండవ చరణంలో 'విరామాలెన్నడు ఎరుగనివి... ఈ వేడుకలు...' అని రాశాను. విరామం, విశ్రాంతి లేకుండా ఈ వేడుకలు, మన బంధం సాగిపోవాలి అని ఈ లైన్ అర్థం. రామా అనే పదాన్ని వాడుతూనే ఎలాంటి తప్పు అర్థం లేకుండా చంద్రబోస్ అద్భుతంగా ఆ పాట రాశారు. ఆ పాట కంప్లీట్ లిరిక్స్ ఇవిగో..

స-స-లు... గ-గ-లు...

గ-గ-లు... ని-ని-లు... స-స-లు... ని-ని-లు... గ-గ-లు... ని-ని-లు...

గ-మ-ద-ని... సగ సగ సగ...

మ-గ-స-ని-ద-ని-స-గ-స-ని-ద-మ...

గమకములు... చాలు చాలు చాలు...

చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు...

ముద్దుగా ముద్దుగా వినవలెగా... నా ముద్దు విన్నపాలు...

పాలు వన్నె పూలలో విడిది చేసి... నన్ను ఆరగిస్తే మేలు...

చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు...

చరణం 1:

నీ కరములు... నా మేనికి వశీకరములు...

నీ స్వరములు... ఈ రేయికి అవసరములు...

ఈ క్షణములు... మన జంటకి విలక్షణములు...

ఈ సుఖములు... మునుపెరుగని బహుముఖములు...

రా మా ఇంటికి మన్మథుడా... అను పిలుపులు...

ఆ లీలలు అవలీలలు...

చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు...

చరణం 2:

ఈ చిలకలు... సరసానికి మధుర గుళికలు...

ఈ పడకలు... మోక్షానికి ముందు గడపలు...

ఈ తనువులు... సమరానికి ప్రాణ ధనువులు...

ఈ రణములు... రససిద్ధికి కారణములు...

విరామాలెన్నడు ఎరుగనివి... ఈ వేడుకలు...

తొలి జాడలు చెలి రూపులు...

చాలు చాలు చాలు... విరహాలు చాలు చాలు.

Read more Photos on
click me!

Recommended Stories