ఇందులో రష్మిక.. శ్రీవల్లి అనే పూర్తి `రా`, డీ గ్లామర్ రోల్ చేస్తుంది. పుష్పరాజ్ క్రష్‌గా కనిపించబోతుంది. అందరు పుష్ప వెంటపడుతుంటే పుష్ప మాత్రం శ్రీవల్లి వెంటపడుతుంటాడట. సినిమా కథ తనకు తెలియదని, తన పాత్ర గురించి కూడా పూర్తిగా తెలియదని, సుకుమార్ సర్ సినిమా, ఆయన పిలుపుతో మరో ఆలోచన లేకుండా ఈ చిత్రం చేసేందుకు ఒప్పుకున్నానని, సినిమా కథ ఎలా ఉంటుందో రిలీజ్ రోజు ఆడియెన్స్ తో కలిసి చూస్తేనే తెలుస్తుందని చెప్పింది రష్మిక. కాకపోతే సుకుమార్ ఓ ప్రపంచాన్నే సృష్టించారని చెప్పింది రష్మిక.